ఈ రోజు మీ రాశి ఫలాలు...
ఏప్రిల్ 19 మంగళవారం 2022
మేషరాశి వారికి ఈ రోజు కార్యసిద్ధి. కీలకమైన నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృషభరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయం. వాహనాలు కొంటారు.
మిధునరాశి వారికి ఈ రోజు పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కుటుంబంలో ఒత్తిడులు.
సింహరాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్యారాశి వారికి ఈ రోజు చిన్ననాటి స్నేహితుల కలయిక. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.
తులారాశి వారికి ఈ రోజు ఎటువంటి పరిస్థితులనైనా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ఇబ్బంది పరుస్తాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు బాధ్యతలు పెరుగుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభం.
మకరరాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. బంధువులతో సత్సంబంధాలు. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు.
కుంభరాశి వారికి ఈ రోజు పరిస్థితుల ప్రభావంతో కొంత ఇబ్బంది పడతారు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఉద్యోగాలలో వివాదాలు.
మీనరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆర్థికంగా కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text