నేడు మీ రాశి ఫలాలు
ఏప్రిల్ 23 శనివారం 2022
మేషరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఇంటాబయటా నిరుత్సాహం. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.
వృషభరాశి వారికి ఈ రోజు మిత్రులతో అకారణవైరం. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఉద్యోగావకాశాలు చేజారవవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మిధునరాశి వారికి ఈ రోజు సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు కొత్త పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి.
సింహరాశి వారికి ఈ రోజు మిత్రులతో కలహాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. అనారోగ్య సూచనలు. ధనవ్యయం. ఉద్యోగాలలో ఒత్తిడులు.
కన్యారాశి వారికి ఈ రోజు రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు.
తులారాశి వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. ఉద్యోగాలు మరింత అనుకూలం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విరోధాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగాలు క్లిష్టంగా మారతాయి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయి.
మకరరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులపై వివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కుంభరాశి వారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. నూతన విద్యావకాశాలు. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి
మీనరాశి వారికి ఈ రోజు చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text