Tap to Read ➤

ఈ రోజు మీ రాశిలో శుభ ఫలాలు.

మే 4 బుధవారం 2022

మేషరాశి వారికి ఈ రోజు రుణయత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిధునరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

సింహరాశి వారికి ఈ రోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్యారాశి వారికి ఈ రోజు పనులలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. సోదరులతో మాటపట్టింపులు.

తులారాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి

వృశ్చికరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. అత్యంత కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.

మకరరాశి వారికి ఈ రోజు వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమా«ధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

కుంభరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.

మీనరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text