Tap to Read ➤

ఈ రోజు మీ రాశిలో జరిగే శుభఫలాలు

మే 6 శుక్రవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు చకచకా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు మిత్రులతో విరోధాలు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

మిధునరాశి వారికి ఈ రోజు మిత్రుల చేయూత అందుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. మానసిక ఆందోళన. కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

సింహరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్యారాశి వారికి ఈ రోజు రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలం.

తులారాశి వారికి ఈ రోజు పనుల్లో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొత్త సమస్యలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు పాతబాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరరాశి వారికి ఈ రోజు నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభరాశి వారికి ఈ రోజు మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. మీ ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికరమైన పరిస్థితి.

మీనరాశి వారికి ఈ రోజు రాబడి అంతగా కనిపించదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text