Tap to Read ➤

నేడు మీ రాశి శుభ ఫలాలు ..!

మే 9 సోమవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

వృషభరాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిధునరాశి వారికి ఈ రోజు కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. భూలాభం.

సింహరాశి వారికి ఈ రోజు బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కన్యారాశి వారికి ఈ రోజు వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

తులారాశి వారికి :- ఈ రోజు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికరాశి వారికి ఈ రోజు బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సురాశి వారికి ఈ రోజు పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

మకరరాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

మీనరాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text