Tap to Read ➤

నిద్రలేమితో జీవితంలో వచ్చే ప్రమాదాలు

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి.

నిద్రలేని వ్యక్తులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. గుండె జబ్బులు, స్టోక్, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.

నిద్రలేమి సమస్య ఉంటే త్వరగా వైరస్, ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంది. హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది.

మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. మానసిక స్థితి స్థిరంగా ఉండదు. నాడీవ్యవస్థ సమతుల్యం దెబ్బతింటుంది.

3 రోజులకు వరకు నిద్రలేకపోతే జ్ఞానేంద్రియాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. నియంత్రణ కోల్పోతున్నట్లుగా ఉంటుంది. 

నెల రోజుల పాటు నిద్ర సరిగా లేకుంటే వారిలో మానసిక స్థితి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వారి మెదడులో ఏవేవో ఆలోచనలు వస్తాయి.

మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఆకస్మాత్తుగా మోనోపాజ్ స్థితికి చేరడం వంటికి జరుగుతాయి. తొందరగా బరువు తగ్గుతారు.

వారం పాటు నిద్రలేకపోతే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏదో కోల్పోతున్నామన్న భావనలోకి వెళ్లతారు. చర్మం పాలిపోతుంది.

మనిషికి తగినంత నిద్ర ఉంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని పెంచుతుంది. శక్తిని పొందుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com