Kolli Venkata Kishore       Apr 26, 2023

స్పియర్‌మింట్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు

స్పియర్‌మింట్‌లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్లు, పోషకాలు ఉంటాయి.

స్పియర్‌మింట్ మెంథోల్ తక్కువగా ఉన్నప్పటికి, లిమోనెన్ , సినియల్, డ్రైహైడ్రోకార్వాన్ అధికం.

స్పియర్‌మింట్ టీని తరచూ తీసుకోవడం వలన శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్పియర్‌మింట్ టీలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే క్రిములకు వ్యతిరేకంగా పోరాడతాయి.

తరచూ స్పియర్‌మింట్ టీ తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

స్పియర్‌మింట్ టీ తాగితే మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

కడుపు నొప్పి, మలబద్ధకం, ఉబ్బరం వంటి అనారోగ్యాలను తొలగిస్తుంది.

దీనిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు శరీరంలో కలిగే నొప్పులు, తల, గొంతు నొప్పులను తగ్గిస్తుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ప్రేగులలో ఉన్న పరాన్న జీవులను తొలగిస్తుంది.