Tap to Read ➤

టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కి.మీ. వరకు ప్రయాణం

తక్కువ సమయంలోనే ఛార్జింగ్ అయ్యే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌తో సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించేలా ఈ కారును అభివృద్ధి చేశారు.

ఆధునిక సాంకేతికతతో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ కారు వెనుక భాగం ఎత్తుగా, ఏటవాలు రూఫ్ లైన్‌తో కూపే డిజైన్‌ను పోలి ఉంది.

2024 నాటికి భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఈ కారు ముందు భాగంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ వంటి వాటిని పొందుపరిచారు. ఇవి బోనెట్ క్రీజ్ మొత్తం వెడల్పులో కనిపిస్తాయి.

కారు లోపలి భాగంలో మినిమలిస్ట్ డ్యాష్ బోర్డు ఉంటుంది. దీనిలో ఒకటి డ్రైవర్ సమాచారం కోసం. మరొకటి ఇన్ఫోటైన్ మెంట్ సెటప్ కోసం ఉంచబడింది.

ప్రైమరీ హెడ్‌లైట్స్ కారు బంపర్‌పై అమర్చబడి ఉన్నాయి. హెడ్‌లైట్ యూనిట్ ట్రైయాంగిల్ షెల్‌లో ఉంచారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com