Tap to Read ➤

అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

విదేశాల్లో చరిత్ర సృష్టిస్తున్న భారత సంతతి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన మహిళ.

మేరీలాండ్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తెలుగు నేపథ్యం ఉన్న కాట్రగడ్డ అరుణా మిల్లర్.

భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెప్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి.

మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ గవర్నర్ పదవి కోసం డెమోక్రటిక్ నాయకుడు వెస్ మూర్, లెప్టినెంట్ గవర్నర్ స్థానానికి అరుణా మిల్లర్ పోటీ.

ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై వీరిద్దరూ ఘన విజయం

గవర్నర్ తర్వాత అత్యున్నత హోదాలో లెప్టినెంట్ గవర్నర్ ఉంటారు.

గవర్నర్ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో లెప్టినెంట్ గవర్నర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారు.

మేరీలాండ్‌లో అరుణా మిల్లర్‌కు ప్రజాదరణ ఎక్కువ

రిపబ్లికన్ మద్దతుదారులు కూడా అరుణా మిల్లర్‌కు అనుకూలంగా పనిచేసినట్లు జోరుగా ప్రచారం

వెస్ మూర్, అరుణా మిల్లర్ కోసం మేరీలాండ్‌లో విస్తృతంగా ప్రచారం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

కాట్రగడ్డ అరుణా మిల్లర్ కృష్ణా జిల్లాలోని వెంట్రప్రగడలో జన్మించారు.

అరుణకు ఏడేళ్ల వయసున్నప్పుడు 1972లో ఆమె కుటుంబం అమెరికా వలస వెళ్లింది.

అరుణ తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు గతంలో ఐబీఎంలో పనిచేశారు.

అరుణా మిల్లర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్

మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు.

తన స్నేహితుడు డేవిడ్ మిల్లర్‌ను అరుణ పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు

మేరీల్యాండ్ గవర్నర్, లెప్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన వెస్ మూర్, అరుణా మిల్లర్ ఇద్దరూ వలసదారుల కుటుంబానికి చెందిన వారే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
facebook