వృషభరాశి వారికి శుక్రుడు, గురువుల కలయిక వల్ల వారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తమ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అవుతారు.
వృషభరాశి వారు కెరీర్ లక్ష్యాలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలం. ఈ సమయంలో ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మిథునరాశిలో జన్మించినవారు ఈ కలయిక వల్ల కెరీర్లో పురోగతి . కొత్తగా ఉద్యోగాన్ని వెతుక్కునే వారికి ఈ సమయంలో శుభం. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే సూచన
మిథునరాశి వారికి పై అధికారుల నుండి ప్రశంసలు . వ్యాపారస్తుల ఆదాయాలు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు.
కర్కాటకరాశి వారికి గురు, శుక్రుల కలయిక వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం గోచరిస్తున్నది. విదేశాల నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు.
వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పరీక్షల ఇంటర్వ్యూకు హాజరుకాబోయే వారు విజయం సాధిస్తారు.
శుక్రుని సంచారం కారణంగా ధనుస్సురాశి వారికి కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో వీరి కెరీర్ చాలా బాగుంటుంది.
ధనుస్సు రాశిలో చాలా మంది కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తారు. వర్క్ చేసేవారు తమ అసలైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
కుంభరాశి వారిని కూడా అదృష్టం వరిస్తుంది. కెరీర్లో మంచి వృద్ధి కనిపిస్తుంది. అదృష్టం వీరి వైపే ఉండటం వల్ల వీరు తమ లక్ష్యాల వైపు కదులుతూనే ఉంటారు.
వీరు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడానికి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం కూడా చక్కగా సాగుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com