Tap to Read ➤

గర్భిణులపై గ్రహణం ప్రభావం ఎంత ?

గ్రహణ సమయంలో బయట తిరగకూడదని అపోహ ఉంది
Venkatakishore kolli

గర్భిణులు గ్రహణం సమయంలో బయట తిరగకూడదని, అది బిడ్డపై ప్రభావం పడుతుంది అపోహా ఉంది.

బయట తిరగడం వల్ల పుట్టబోయే బిడ్డలకు గ్రహణం మొర్రి వస్తుందని అపోహ.

గ్రహణం మొర్రి అనేది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే అవకరం.

గ్రహణం సమయంలో గర్భిణులు సరిగా ఉండకపోవడం వల్లే గ్రహణ మొర్రి వస్తుందనే దానిలో ఎటువంటి శాస్త్రీయతా లేదు.

ప్రతి 1000 మందిలో ఒకరికి గ్రహణ మొర్రి రావడం మామూలే.

పిండం ఎదిగే సయమంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు బిడ్డలో తల భాగం రూపొందుతుంది.





పిండం ఎదిగే సమయంలో బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు.

అలాంటి సమయంలో బిడ్డలో ఈ గ్రహణ మొర్రి ఏర్పడుతుంది.

శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మొర్రి సమస్యను సమర్ధంగా చక్కదిద్దవచ్చు

గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.

గ్రహణ సమయంలో అనుమానాలు, అపోహాలు మాని మామూలుగానే ఉండవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి