• search
 • Live TV
keyboard_backspace

మరో నయీంగా.. నోరు విప్పి ఉంటే: ఎవరీ వికాస్ దుబే? నేతలు, పోలీసుల అండదండలు: నేర సామ్రాజ్యం

లక్నో: వికాస్ దుబే.. కొద్దిరోజులుగా వార్తల్లో వినిపిస్తోన్న ఓ గ్యాంగ్‌స్టర్ పేరు ఇది. ఒక్క షూటౌట్‌లో ఓ డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన టాప్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతని ఎన్‌కౌంటర్ అనంతరం ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగిందంటే అతని రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వికాస్ దుబే నోరు విప్పతే బీజేపీ ప్రభుత్వం కూలుతుందనే ఆరోపణలు ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను ముంచెత్తుతున్నాయి.

వికాస్ దుబే ఇదివరకు ఒకట్రెండు రాజకీయ పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీలో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చకున్నాడు. ఆ సమయంలోనే నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేశాడు. రాజకీయంగా తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకున్నారు. పోలీసుశాఖతోనూ పరిచయాలను పెంచుకున్నాడు.

Who is Vikas Dubey? his life of crime spanning 30 years in Uttar Pradesh

అటు రాజకీయ నేతలు, ఇటు పోలీసులతో అండదండలతో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడనే అరోపణలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అతనిపై 62 కేసులు నమోదు అయ్యాయి. అందులో అయిదు హత్యనేరాలకు సంబంధించినవి.

2001లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ శుక్లాను శివ్లీ పోలీస్‌స్టేషన్‌లోనే కాల్చి చంపాడు. ఈ ఘటనలో తప్పించుకుని పారిపోయిన అతను ఆరునెలల తరువాత లొంగిపోయాడు.

  Vikas Dubey ఎన్కౌంటర్ , పారిపోతుండగా కాల్చి చంపిన పోలీసులు!! || Oneindia Telugu

  1999లో తన సొంత గ్రామంలో ఝున్నా బాబా అనేక వ్యక్తితో అతని నేర ప్రస్థానం ఆరంభమైంది. ప్రాపర్టీ విషయంలో ఝున్నా బాబాను దారుణంగా హతమార్చాడు. తారాచంద్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకున్న అతను 2000లో రిటైర్డ్ ప్రిన్సిపల్ సిద్ధేశ్వర్ పాండేను హత్య చేశాడు. ఈ కేసులో కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. 2002లో దినేష్ దుబే అనే కేబుల్ ఆపరేటర్‌ను హతమార్చాడు. 20 వేల రూపాయల వివాదంలో దినేష్ దుబేను కాల్చి చంపాడు.

  ఉత్తర ప్రదేశ్ సహరాన్‌పూర్‌లో అతనిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. మారణాయుధాల అక్రమ రవాణా అతనికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు చెబుతున్నారు. కాన్పూర్, కాన్పూర్ దేహత్, లక్నో, సహరాన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్లలో అతనిపై మొత్తం 64 కేసులు నమోదు కాాగా.. అందులో రెండింట్లో మాత్రమే అతను నిర్దోషిగా తేలాడు. మిగిలిన 62 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో అయిదు హత్యకేసులు కావడం అతని నేర ప్రవ‌ృత్తికి అద్దం పడుతోంది.

  English summary
  Back in 2001, Vikas Dubey allegedly chased a BJP leader who then had minister of state rank in UP, Santosh Shukla, inside Shivli police station in Kanpur Dehat. Dubey was named in the FIR, and he surrendered after some six months, but was acquitted four years later.
  Related News
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X