వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాముతో సెల్ఫీకి యువతి ఆరాటం: చుక్కలు చూసింది(పిక్చర్స్)

తాను పెంచుకుంటున్న పెంపుడు పాము బార్డ్‌తో సెల్ఫీ తీసుకుందామనుకుంది ఓ యువతి. అయితే, అది ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది.

|
Google Oneindia TeluguNews

పోర్ట్‌లాండ్: తాను పెంచుకుంటున్న పెంపుడు పాము బార్డ్‌తో సెల్ఫీ తీసుకుందామనుకుంది ఓ యువతి. అయితే, అది ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది. ఓరేగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను సదరు యువతి.. సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.

సెల్ఫీ కోసం ఆరాటం

సెల్ఫీ కోసం ఆరాటం

వివరాల్లోకి వెళితే.. పోర్ట్‌లాండ్‌కు చెందిన ఆష్లే గ్లేవ్ ఓ పామును పెంచుకుంటుంది. తన పెంపుడు పాము బార్ట్‌తో సరదాగా సెల్ఫీ తీసుకోవాలని భావించింది. కుడిచెంపకు పక్కన బార్ట్‌ను ఉంచి సెల్ఫీ తీసుకోవాలని చూసింది. ఇంతలో బార్ట్‌ అనే పాము ఆమె చివి రంద్రంలోకి దూరిపోయింది.

చెవి రంధ్రంలోంచి దూరింది

చెవి రంధ్రంలోంచి దూరింది

చెవికి ఏదో ఆభరణం ధరించేందుకు పెద్ద సైజులో రంద్రాన్ని చేసుకోగా, అందులోకి దూరిన బార్ట్‌ కొన్ని సెకన్లలో అలాగే ఉండి ఇరుక్కుపోయింది. ఈ ఫొటోలను ఆ యువతి తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసి తన ఆవేదనను పంచుకుంది.

చుక్కలు చూపింది

చుక్కలు చూపింది

తన బార్ట్‌‌తో ఎదుర్కొన్న సమస్యను తన పోస్ట్ లో రాసుకొచ్చింది. చివరికి బార్ట్‌ను బయటకు తీయడం రాక, హాస్పిటల్‌కు పరుగులు తీయాల్సి వచ్చిందని వాపోయింది. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో దిగిన ఫొటో పోస్ట్ చేయగా విపరీతంగా లైక్స్, షేర్లు రావడం గమనార్హం.

కథ సుఖాంతం

కథ సుఖాంతం

సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఇలా జరిగిందంటూ డాక్టర్‌కు వివరించింది ఆష్లే. పాముకు ఏం జరగకూడదని చెప్పడంతో, వైద్యులు ఆమె చెవిని కాస్త కట్ చేసి పామును బయటకు తీయడంతో ఆమె ఊపిరిపీల్చుకుంది. కాగా, ఆష్లేకు ఇలాంటి సెల్ఫీలు మరోసారి దిగకూడదని నెటిజన్లు సూచనలు ఇవ్వడం కొసమెరుపు.

English summary
Of all the places for your pet to get stuck, your earlobe would be the last place you’d expect. But then, they do say that reality is stranger than fiction, and in the case of Oregon, US-based Ashley Glawe this is exactly what happened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X