వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ అసెంబ్లీ పోరు: స్వల్ప మార్పులతో అంచనాలే తారుమారు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎటు మొగ్గుతున్నారన్న సంగతి తెలియక ప్రధాన పార్టీల మధ్య ఉత్కంఠ రేపుతున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎటు మొగ్గుతున్నారన్న సంగతి తెలియక ప్రధాన పార్టీల మధ్య ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార ఎస్పీ - కాంగ్రెస్‌ కూటమి, బీజేపీ, బీఎస్పీ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు హోరాహోరీ సాగుతున్న త్రిముఖ పోరులో గెలుపొందేదెవరన్న అంశంపై ఓటర్లు, రాజకీయ నాయకులు, విశ్లేషకుల మధ్య తీవ్ర ఆసక్తి నెలకొంది.

కొంచెం అటూఇటూ మారితే అంతా తారుమారేనన్న చందంగా ఏ కొద్ది మంది ఓటర్ల మనస్సు మారినా ఎన్నికల ఫలితాలు భారీస్థాయిలో మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. అంచనాలతోపాటు పార్టీల బలబలాల్లో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.

గత ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని వారు గుర్తుచేస్తున్నారు. ఇక త్రిముఖ పోటీలోని కాంగ్రెస్, అధికార సమాజ్ వాదీ, బీజేపీ, బీఎస్పీ తమకు బలం ఉన్న ప్రాంతాల్లో అదే స్థాయిలో పట్టును కొనసాగించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు తగ్గిన ఆధిపత్యానికి పూర్వ వైభవం సంతరించుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తోంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టినా.. కొన్ని ప్రాంతాల్లో నిరంతరం ఓటమి పాలవుతూనే ఉన్నాయి. ఈ పరిణామం అధికార ఎస్పీ నుంచి దాని మిత్రపక్షం కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మాయావతి సారథ్యంలోని బీఎస్పీకి ఒకేలా వర్తిస్తుందనడంలో సందేహం లేదు.

ఎస్పీ పరిణామ క్రమం ఇలా..

ఎస్పీ పరిణామ క్రమం ఇలా..

2007లో సమాజ్‌వాదీ గెలుపొందిన స్థానాలు 97 మాత్రమే. కానీ ఐదేళ్ల తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ కేవలం అదనంగా మూడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని 97 స్థానాల నుంచి రికార్డు స్థాయిలో 224 స్థానాలకు ఎగబాకింది. 29.29 % ఓట్లతోనే అధికారాన్ని చేపట్టిన సమాజ్ వాదీ పార్టీ.. 2002, 2007, 2012 ఎన్నికల్లోనూ 178 స్థానాల్లో ఓటమి పాలైంది. ఎటా, ఎటావా, కిష్ని, జస్రానా, మెయిన్ పురి, అలీగంజ్, జస్వంత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎస్పీ వ్యవస్థాపక అధినేత ములాయంకు గట్టి పట్టు ఉంది. కానీ రాష్ట్ర రాజధాని లక్నో నగరం మొదలు అమేథీ, రాయబరేలీ పరిసర ప్రాంతాల్లో బలహీనమే. 2012లో అమేథీ, రాయబరేలీలలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. ఎస్పీతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో తిరిగి పూర్వ వైభవం సంపాదించాలని తలపోస్తున్నది.

100 స్థానాల్లో విజయానికి దూరంగా బీఎస్పీ

100 స్థానాల్లో విజయానికి దూరంగా బీఎస్పీ

2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 30 శాతం, ఎస్పీ 26 , బీజేపీ 17, కాంగ్రెస్‌ 8.5 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. 2007తో పోల్చితే బీఎస్పీ 4.5 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా సాధించినా ఆ పార్టీ గ్రాఫ్ 206 నుంచి 80కు పడిపోయింది. 2002, 2007, 2012 ఎన్నికల్లో వరుసగా సుమారు 100 స్థానాల పరిధిలో బీఎస్పీ ఓటమిని చవిచూస్తేనే ఉన్నది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలంటే వీటిలో కొన్ని స్థానాల్లోనైనా బీఎస్పీ గెలుపొందడం తప్పనిసరి. దళితులు మాయావతికి దన్నుగా నిలిచినా ఎస్పీ వ్యవస్థాపక అధినేత ములాయం, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ లతోపాటు నెహ్రూ గాంధీ కుటుంబానికి పట్టున్న ప్రాంతాల్లో బీఎస్పీ పాగా వేయలేక ఓటమి పాలవుతూనే ఉన్నది.

 బీజేపీలో మౌర్య, పాఠక్ చేరికతో మాయాకు కష్టాలు

బీజేపీలో మౌర్య, పాఠక్ చేరికతో మాయాకు కష్టాలు

పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీ మద్దతుదారులు జాట్ల ప్రాబల్యమూ మాయావతి ప్రాభవానికి గండికొడ్తున్నది. సికిందరబాద్, ముజఫర్ నగర్, బాగ్ పట్, కైరానా, థానాభవన్ లతోపాటు సుమారు 35 సెగ్మెంట్ల పరిధిలో బీఎస్పీ ఖాతా తెరవలేకపోతున్నది. ప్రతి నియోజకవర్గంలో 30 - 50 వేల మంది మధ్య జాట్లు ఉన్నందున వారి ఓట్లు ప్రతి రాజకీయ పార్టీకి కీలకం కానున్నాయి. వీరికి ప్రత్యామ్నాయంగా ముస్లింలను తన వైపుకు తిప్పుకోవాలని మాయావతి తలపోస్తున్నారు. బ్రాహ్మణులు, ఓబీసీల ఓట్లు కొల్లగొడదామని ఆమె చేసిన ప్రయత్నాలకు చెక్ పెడుతూ బీఎస్పీ సీనియర్ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేశ్ పాఠక్ బీజేపీలో చేరడం మాయావతికి పెద్ద ఎదురు దెబ్బ.

పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్

పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్

2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 18.25 % ఓట్లతో 21 సీట్లు పొందితే, 23.26 శాతం ఓట్లు పొందినా ఎస్పీ 23 స్థానాలతో మంచి ఫలితాలు సాధించాయి. నాడు అధికారంలో ఉన్న బీఎస్పీ 27.42 శాతం ఓట్లు పొందినా 20 స్థానాలకు పరిమితం కాగా... బీజేపీ కేవలం 17.5 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకున్నది. కానీ 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారమారు అయ్యాయి. బీజేపీ ఓట్లశాతం 42.6కు ఎగబాకడంతో 71 స్థానాలు గెలుచుకుని ప్రత్యర్థులను చిత్తుచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మొత్తం 403 సెగ్మెంట్ల పరిధిలో 80 శాతం స్థానాల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఎస్పీ 42 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యం కనపరిచాయి.

బీజేపీ పరిస్థితి ఇలా..

బీజేపీ పరిస్థితి ఇలా..

2014 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 10 శాతం తగ్గినా అధికార పీఠం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ 32 శాతం ఓట్లు సాధిస్తే మెజార్టీకి అవసరమైన 202 సీట్లను సులువుగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఓబీసీల్లో పట్టున్న అప్నాదళ్‌తో పొత్తు తమకు లాభం చేకూరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. దీనికి తోడు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనూ చిన్నా చితక పార్టీలు, కులాలు, ఉప కులాలు కీలక పాత్ర పోషించనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పట్టు కొనసాగిస్తున్న కల్యాణ్ సింగ్

పట్టు కొనసాగిస్తున్న కల్యాణ్ సింగ్

మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయి హయాంలో బీజేపీకి రాష్ట్ర రాజధాని లక్నో పరిసర ప్రాంతాలు దుర్గాలుగా ఉండేవి. 2012 ఎన్నికల్లో ఈ పరిస్థితి మారిపోయింది. 2002లో 88 (25.31%) సీట్ల నుంచి 2008లో 19.61 శాతం ఓట్లతో 51 స్థానాలకు పరిమితమైంది. ఇంకా 2012లో 47 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 15.21 శాతం ఓట్లు పొందగలిగింది. మధ్య యూపీ ప్రాంతం అవధ్ రీజియన్ లో పట్టు కోల్పోయింది. రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ సొంత ప్రాంతం అలీగఢ్ లో పట్టు ఉన్నందు వల్లే ఆయన మనుమడితోపాటు కొందరికి బీజేపీ టిక్కెట్లు టిక్కెట్లు ఇచ్చింది.

English summary
Political scholars saying BJP and Samajwadi Parties are have chances to win
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X