హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్! మీ వల్లే: సింధుతో చంద్రబాబు షటిల్, 'గోపీచంద్‌కు స్థలం ఇవ్వకుంటే ఎక్కడిది'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధును, కోచ్ గోపీచంద్‌ను ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఘనంగా సన్మానించనుంది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఆమెకు ఘన స్వాగతం పలికింది. రజతం సాధించడంతో సింధు ఒక్కసారిగా స్టార్ అయింది. మంగళవారం ఏపీ ప్రభుత్వం సన్మానిస్తోంది.

సర్ మీవల్లే: సింధు

రజతం సాధించిన సింధు మాట్లాడుతూ... తాను పతకం సాధించడానికి తెలుగు ప్రజల ఆశీస్సులు కారణమని చెప్పారు. సర్ మీ ప్రోత్సాహం వల్లే సాధించానని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతమంది వస్తారని ఊహించలేదన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను చిన్నప్పుడు తన తాతయ్య ఇంటికి ఇక్కడకు (విజయవాడ)కు వచ్చేదానిని అని గోపీచంద్ ఆడుతుంటే చూసేదాన్నని చెప్పారు.

గోపీచంద్ మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో కరణం మల్లీశ్వరికి సన్మానం చేస్తుంటే ఎందుకు అంత ఆర్భాటంగా చేస్తున్నారో అనుకున్నానని, ఆ సన్మానం చూసే తాను బ్యాడ్మింటన్‌లో రాణించానని చెప్పారు. ఆ స్ఫూర్తితో ఎన్నో మెడల్స్ సాధించానన్నారు. ఈ రోజు సింధు గెలుపు సంతోషంగా ఉందన్నారు.

పీవీ సింధుకు రజతం: వర్మ అనుమానం, 'పశువు'తో నెటిజన్ల ఎదురుదాడిచంద్రబాబు స్థలం ఇవ్వకుంటే..

- మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో అతిపెద్దదైన భారత్ నుంచి ఒక్కరూ పతకం సాధించలేదని ఆందోళన చెందుతున్న సమయంలో పీవీ సింధు పతకం తీసుకు వచ్చిందన్నారు. ఈ రోజు క్రీడల్లో ఎక్కువ పేరు వచ్చిందంటే ఆ రోజు సమైక్య రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిన ప్రయత్నమన్నారు.

ఆ రోజు గోపీచంద్‌ను ప్రోత్సహించి, హైదరాబాదులో అకాడమీకి స్థలం ఇచ్చారన్నారు. ఆ రోజు గోపీచంద్‌కు చంద్రబాబు స్థలం ఇవ్వకుంటే ఈ రోజు రియోలో మనకు పతకం వచ్చి ఉండకపోయేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నవ్యాంధ్రలోను క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

రేపటి రోజుల్లో రియో ఒలింపిక్స్‌లో (టోక్యో ఒలింపిక్స్ అనబోయి రియ అన్నారు) మరిన్ని పతకాలు రావాలంటే ఏపీ నుంచే సాధ్యమయ్యేలా చేస్తామన్నారు. పీవీ సింధును అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగింటి ఆడపడుచూ ఈ స్థాయికి ఎదిగినందుకు అందరం గర్విస్తున్నామన్నారు.

సింధు చంద్రబాబు తయారు చేసిన వజ్రం అన్నారు. ప్రపంచంలో తెలుగువారికి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే అందుకు చంద్రబాబు కారణం అన్నారు. ఆయన విజన్ చాలా గొప్పదన్నారు. ఆనాడు ఎంతో ముందు చూపుతో గోపీచంద్ అకాడమీ పెట్టడానికి కారణమని అచ్చెన్నాయుడు అన్నారు.

సింధు భుజం తట్టి-గోపీచంద్‌ని కౌగిలించుకొని, గెలిచిన వారికే కాదన్నారు.. కేటీఆర్

- ఎంపీ కేశినేని నాని, నన్నపనేని రాజకుమారి తదితరులు సింధుకు బహుమతి అందజేశారు.

- వేదిక పైన చంద్రబాబు రజతం గెలిచిన సింధుతో షటిల్ ఆడారు.

- సింధు సన్మాన వేడుకకు ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానం చేశారు.

- సింధు విజయం నేపథ్యంలో 'జయహో జయహో సింధు' అంటూ ఓ పాటను పాడారు. ఈ గీతం అందర్నీ ఆకట్టుకుంది.
- వేదిక పైకి వచ్చిన పలువురు మంత్రులు, నేతలు సింధును అభినందించారు. పీతల సుజాత సహా పలువురు ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చారు.
- సింధు వేదిక పైకి చేరుకోగానే.. సింధు సింధు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
- వేదిక పైకి గోపీచంద్, సింధు రాగానే చంద్రబాబు వారిని గజమాలతో సత్కరించారు. వారిని స్వయంగా ఆహ్వానించారు.
- మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయానికి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అభినందన సభ ప్రారంభమైంది. వేదిక పైన సింధు, గోపిచంద్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసీనులయ్యారు.

శివమని డ్రమ్స్

- సింధు సన్మాన సభలో డ్రమ్స్ మాస్టర్ శివమణి సందడి చేశారు. సింధు స్టేడియం చేరుకునేలోగా అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు శివమని తన స్టయిల్లో చేతుల్లో స్టిక్స్ తిప్పుతూ నోటితోనే మ్యూజిక్ వినిపిస్తూ సందడి చేశారు. శివమణి పక్కనే ఎమ్మెల్యే బోండా ఉమ నిలబడి ఆయన సంగీతాన్ని ఆస్వాదించారు.

- భాగ్యనగరి కంటే విజయవాడలో సింధుకు, గోపిచంద్‌కు ఘన స్వాగతం లభించిందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు వారికి ఘన స్వాగతం పలికాయి. ఏపీ మాత్రం కొంత భిన్నంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. గన్నవరం నుంచి బెజవాడ వరకు హైదరాబాదు కంటే ఘనంగా స్వాగతం లభించిందని చెప్పవచ్చు.

- అభిమానులు గన్నవరం నుంచి కేసరపల్లి వరకు 2 కిలో మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. సింధు వాహనాన్ని నిలిపి కేసరపల్లి వాసులు పట్టువస్త్రాలు అందించారు. దారిపొడవునా నినాదాలు చేస్తూ ఉత్సాహపరిచారు.

- సింధుకు ఎప్పటికీ గుర్తుండేలా విజయోత్సవ ర్యాలీని తీస్తున్నారు.
- సింధు ఈ రోజు దుర్గా ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించనున్నారు. అనంతరం కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోనున్నారు.
- సింధుకు స్వాగతం పలికేందుకు టిడిపి నేతలు, మంత్రులు గన్నవరం విమానాశ్రయంలో క్యూ కట్టారు. మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మాగంటి బాబు, బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టిడిపి యువనేత వల్లభనేని వంశీ తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.
- చప్పుళ్లు, మేళతాళాలతో సింధు, గోపిచంద్‌లను తీసుకెళ్తున్నారు.
- గన్నవరం నుంచి విజయవాడ ఇందిరా ప్రియదర్శిని ఆడియోరియం వరకు భారీ ర్యాలీ తీస్తున్నారు.
- సింధుకు విమానాశ్రయంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాభిమానులు స్వాగతం పలికారు.
- పీవీ సింధు, గోపిచంద్, కుటుంబ సభ్యులు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

సర్! మీ వల్లే

సర్! మీ వల్లే

ఈ రోజు ఏపీ విజయవాడలో ఘన స్వాగతం పలికి, సన్మానం చేస్తోంది. హైదరాబాద్ నుంచి సిందును, కోచ్ గోపీచంద్‌ను విజయవాడకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు సర్కారు ఏకంగా ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆ విమానం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరింది.

సింధుతో చంద్రబాబు షటిల్

సింధుతో చంద్రబాబు షటిల్

సింధు, గోపీచంద్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విమానంలో విజయవాడ వచ్చారు. ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోగానే వారికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సింధును క్యాష్ చేసుకునేందుకు ఏపీ - తెలంగాణలో పోటాపోటీగా సన్మానిస్తున్నాయనే వాదనలు ఉన్నాయి.

సింధుతో చంద్రబాబు షటిల్

సింధుతో చంద్రబాబు షటిల్

పీవీ సింధు నేడు విజయవాడకు రానుంది. ఈ సందర్భంగా చేపట్టనున్న విజయోత్సవ ర్యాలీ సందర్భంగా నగరంలో ఉదయం 8.30 నుంచి 11.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

సింధుతో చంద్రబాబు షటిల్

సింధుతో చంద్రబాబు షటిల్

గన్నవరం వద్ద రద్దీ ఎక్కువైతే బీబీ వాహనాలను బీబీ గూడెం మీదుగా మళ్లిస్తారు. రామవరప్పాడు వద్ద రద్దీ ఎక్కువైతే ఎనికేపాడు 100 అడుగుల రోడ్డు నుంచి తాడిగడప 100 అడుగుల రోడ్డు వైపు మళ్లిస్తారు. బెంజి సర్కిల్‌ వద్ద రద్దీ ఎక్కువైతే, న్యూబ్రిడ్జి-రామలింగేశ్వర్‌ కట్ట-గుల్జార్‌ మీదుగా ఎన్టీఆర్‌ సర్కిల్‌-తాడిగడప వైపు మళ్లిస్తారు.

English summary
After Olympic success, Andhra Pradesh, Telangana spar over PV Sindhu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X