వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఏపీ బలం ఇదీ: ఐటీ ఫోరంలో బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోక్యో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుందరమైన బీచ్‌లు, రిసార్టులు, ఎకో టూరిజం, బుద్ధిస్టు టూరిజం, టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోడ్లు, రైలు మార్గాలు, విమానయాన సదుపాయాలకు లోటు లేదన్నారు. వాటిని మరింత అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో అసలు విద్యుత్తు కోత అన్నదే ఉండదని, దేశంలో నిరంతర విద్యుత్తు పథకానికి ఎంపికైన మూడో రాష్ట్రం ఏప అన్నారు.

చివరి భూముల వరకూ రహదారులు, రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఎగుమతి, దిగుమతులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ల ఏర్పాటుకు కసరత్తు సాగుతోందన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం ఉన్న విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను విస్తరించడంతోపాటు ప్రతి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో ఐటీ నైపుణ్యానికి కొదవలేదని, అదే తమ బలమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పానాసోనిక్, తదితర కంపెనీల ప్రతినిధుల మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పానాసోనిక్, తదితర కంపెనీల ప్రతినిధుల మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పానాసోనిక్ కంపెనీకి చెందిన తకేషీ యూనోయమాకు మెమొంటో ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని జపాన్‌ ఒకాసా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అంతర్జాతీయ కమిటీ చైర్మన్‌ హషిమోటో చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఒకాసా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కమిటీలో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు క్యోటోలోని ఐటీ ఫోరం సదస్సులో మాట్లాడుతున్న దృశ్యం

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు క్యోటోలోని ఐటీ ఫోరం సదస్సులో మాట్లాడుతున్న దృశ్యం

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు క్యోటో మేయర్ దైసాకు కొడకవకు మెమొంటోను ఇస్తున్న దృశ్యం.

ప్రఖ్యాత విద్యా, వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని, అదనంగా మరో పదిహేను క్లస్టర్ల ఏర్పాటుకు భూములను గుర్తించామన్నారు. శ్రీసిటీ సమర్థంగా పని చేస్తోందన్నారు. కొన్ని జపాన్‌ కంపెనీలు ఇప్పటికే ఇక్కడ పరిశ్రమలను ప్రారంభించాయన్నారు. కృష్ణపట్నంను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడలో హార్డ్‌వేర్‌ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎంవోలో జపాన్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సింగిల్‌ విండో ప్రాతిపదికతోపాటు సింగిల్‌ డిస్క్‌ నుంచే ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తున్నామన్నారు. భారత్‌ పట్ల గతంలో ఉన్న అపోహలను తొలగించుకోవాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నాయన్నారు.

English summary
Photos of AP CM Chandrababu Naidu is presenting memento to Kyoto Mayor Daisaku Kadokawa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X