విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడు నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన రేవంత్: ఏం జరిగింది?

సహజంగానే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు.. విభేదాలేమైనా పొడచూపాయా? అన్న చర్చ జరగడం కూడా సహజమే. అయితే రేవంత్ విషయంలో మాత్రం అలాంటిదేమి లేదని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరుగుతున్న సమయంలో.. నేతలెవరైనా మధ్యలోనే జారుకుంటే!.. కచ్చితంగా దాని చుట్టూ అనుమానాలు ముసురుకోవడం ఖాయం. విశాఖలో ఆదివారం మహానాడు రెండో రోజు సందర్బంగా.. రేవంత్ రెడ్డి మధ్యలోనే నిష్క్రమించడం ఈ అనుమానాలకు తావిచ్చింది.

రేవంత్ మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయారు? అని పలువురు ఆరా తీయడం మొదలుపెట్టారు. సహజంగానే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు.. విభేదాలేమైనా పొడచూపాయా? అన్న చర్చ జరగడం కూడా సహజమే. అయితే రేవంత్ విషయంలో మాత్రం అలాంటిదేమి లేదని తెలుస్తోంది.

revanth reddy walk out from mahanadu during the meeting is going on

కేవలం వ్యక్తిగత ఆరోగ్య కారణాల రీత్యా.. ఆయన మధ్యలోనే వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. జ్వరం, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న రేవంత్.. హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లినట్లు సమాచారం. కాగా, సోమవారం నాడు మహానాడు వేదిక నుంచి రేవంత్ ప్రసంగించనున్నారు. మాట్లాడితే కేసీఆర్ పై విరుచుకుపడే ఆయన.. ఈ వేదిక నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయిందని టీఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో..సర్వేలు సైతం టీఆర్ఎస్‌కు తిరుగులేదని చెబుతున్న నేపథ్యంలో.. రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు.

English summary
On sunday, Telangana Telugu Desam party working president Revanth Reddy was walked out from Mahanadu, during the meeting is going on
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X