వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ సలహానా.. హద్దుదాటిన షర్మిల, నాని!: నాలుక కోస్తామని అవినాష్ వార్నింగ్

ప్లీనరీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తమ ప్రసంగంలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్లీనరీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తమ ప్రసంగంలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఏదో విధంగా ప్రజల నోళ్లలో నానేందుకు కొందరు మాట్లాడినట్లుగా ఉందంటున్నారు.

చదవండి: టిడిపికి ప్రశాంత్ కిశోర్ హడల్: అంతా ఆయనే, జగన్‌ది యాక్షన్

వైసిపి నేతలు పదేపదే చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. రోజా, కొడాలి నాని, లక్ష్మీపార్వతి, షర్మిల, వైయస్ విజయమ్మ... ఇలా చాలామంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోవడం లేదు.

చదవండి: జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)

Recommended Video

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal bypolls

కొడాలి నాని వంటి వారు అయితే హద్దులు దాటారు. వైసిపి నేతల తిట్ల దండకంతో టిడిపి నేతలు ఆశ్చర్యపోయారని, దీంతో సోమవారం తీవ్రంగా ఎదురు దాడి చేశారంటున్నారు. మొత్తానికి పలువురు నేతలు హద్దులు దాటారంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారా అని ఎద్దేవా

ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారా అని ఎద్దేవా

జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆయన సూచనల మేరకు జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని ప్రశాంత్ సూచించారా అని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. ఎప్పుడు వార్తల్లో ఉండాలని ప్రశాంత్ కిషోర్ చెబితే.. వైసిపి నేతలు తిట్టడంతో అలా ఉండాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. గతంలోను వాారికి తిట్ల దండకం అలవాటు అని, కాబట్టి ఆయన ఓ విషయం చెబితే వీరు మరోలా అర్థం చేసుకున్నట్లుగా ఉందంటున్నారు.

అలా మరింత రెచ్చిపోయారు.. టిడిపి కౌంటర్

అలా మరింత రెచ్చిపోయారు.. టిడిపి కౌంటర్

వ్యక్తిగతంగా వెళ్తే పార్టీకి, తమకు వ్యక్తిగతంగా మైలేజ్ వస్తుందని వైసిపి నేతలు భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేశారని అంటున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటే జగన్ ఏమీ అనకపోవడంతో.. నేతలు మరింత రెచ్చిపోయారని అంటున్నారు. దీనికి టిడిపి నేతలు ధీటుగా స్పందించారు. ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి, యనమల.. వంటి నేతలంతా తిట్ల పురాణంపై ధ్వజమెత్తారు. అయితే మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం వైసిపి నేతలు ఎలాగైతే ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆయన కూడా అలాగే కౌంటర్ ఇచ్చారు. జైలు జీవితం గడిపిన జగన్‌తో మీ వదిన ఎలా కాపురం చేస్తుందో షర్మిల తెలుసుకోవాలని ఘాటుగానే మాట్లాడారు.

నాలుకలు తెగ్గోస్తాం

నాలుకలు తెగ్గోస్తాం

టిడిపి నేతలపై అవినీతి ఆరోపణలు చేసి జగన్ మెప్పు పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, పిచ్చపిచ్చ ఆరోపణలు చేసే వారి నాలుకలు తెగ్గోస్తానని టిడిపి యువ నాయకుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. కేవలం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లపై ఆరోపణలు చేసేందుకే వైసిపి ప్లీనరీ పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును విమర్శించడం సబబు కాదని, తమ మూడేళ్లలో పాలనలో ఏవైనా లోపాలు ఉంటే ఎత్తి చూపితే, సరిచూసుకుంటాం తప్పా, లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

వైసిపి నేతల భాష దారుణం, మేం మాట్లాడగలం కానీ..

వైసిపి నేతల భాష దారుణం, మేం మాట్లాడగలం కానీ..

వైసిపి నేతలు మాట్లాడే భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని దేవినేని అవినాశ్ అన్నారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు నోరుపారేసుకున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా జగన్‌ని తాము తిట్టగమని కానీ, చంద్రబాబు తమకు క్రమశిక్షణ, సంస్కారం నేర్పించారన్నారు. కాబట్టి అలా తాము ప్రవర్తించమన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు వైసీపీ రూ.50 కోట్లు ఇచ్చి తెప్పించుకుందని, యాభై కోట్లు కాదు కదా ఐదు వందల కోట్లు వెచ్చించినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయేనని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబేనని ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబాన్ని ఇలా టార్గెట్ చేశారు

కుటుంబాన్ని ఇలా టార్గెట్ చేశారు

కాగా, రోజా, షర్మిలలు చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కొడాలి నాని అయితే మరీ రెచ్చిపోయి మాట్లాడారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందరు కూడా చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆయనను తిట్టమని జగన్ చెబుతున్నారని రోజాకు ఉమ్మారెడ్డి చెప్పినట్లుగా మైకులోనే వినిపించింది. ఇక, షర్మిల.. భువనేశ్వరి, నారా లోకేష్‌లపై సెటైర్లు వేశారు. ఓ విధంగా తండ్రిని చంపినా భర్తతో ఉంటుందని ఆమెను వెక్కిరించినట్లుగా ఉందంటున్నారు. ఇక, కొడాలి నాని అయితే చంద్రబాబు ఎప్పుడు చనిపోతారా, ఆయన చనిపోతే లోకేష్ పార్టీని ముంచేస్తారు అని వ్యాఖ్యానించారు. ఆయనకు 70 ఏళ్ల వయస్సు అని, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయన ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో తెలియదన్నారు. సిగ్గుమాలిన వ్యక్తులు.. అంటూ రోజా ఎప్పటిలాగే తన నోటికి పనికి చెప్పారు.

English summary
Sharmila, Roja shocking comments on Chandrababu family, TDP leaders counter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X