వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా తర్వాత మనమే: నారా లోకేష్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా సైన్యం 30లక్షల మందితో పటిష్ఠంగా ఉందని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 25లక్షల మంది కార్యకర్తలను నమోదు చేయడంతో బలోపేతమమవుతోందని ఆ పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. ఆయన గురువారం తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
25 లక్షల మంది కార్యకర్తలను నమోదు చేసే లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అండమాన్ నికోబర్ దీవులు, ఒరిస్సా రాష్ట్రాలలోను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

ఈ రాష్ట్రాలలో డిసెంబరులో చేపడతామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు బ్రోచర్‌ను పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులతో కలిసి ఆవిష్కరించారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిధి ప్రారంభించామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. పార్టీ సభ్యత్వ రుసుము కేవలం రూ.10లు అన్నారు. క్రియాశీలక సభ్యత్వానికి 100 రూపాయలను ఎంట్రీ ఫీజుగా ఉంటుందన్నారు.

టీడీపీ కార్యకర్తలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కార్యకర్తల క్షేమం కోసమే సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డ కార్యకర్తలకు వైద్య సాయం అందిస్తామన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఇది ఆరు నెలలుగా పని చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా ఉంటుందన్నారు. కార్యకర్తల నుండి ఎనిమిదివేల వినతులు వస్తే అరవై శాతం పరిష్కరించామన్నారు.

లోకేష్

లోకేష్

పార్టీ సభ్యత్వ నమోదు బ్రోచర్‌ను పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులతో కలిసి నారా లోకేష్ ఆవిష్కరించారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిధి ప్రారంభించామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.

లోకేష్

లోకేష్

అమెరికా సైన్యం 30లక్షల మందితో పటిష్ఠంగా ఉందని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 25లక్షల మంది కార్యకర్తలను నమోదు చేయడంతో బలోపేతమమవుతోందని ఆ పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
25 లక్షల మంది కార్యకర్తలను నమోదు చేసే లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అండమాన్ నికోబర్ దీవులు, ఒరిస్సా రాష్ట్రాలలోను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

లోకేష్

లోకేష్

ఈ రాష్ట్రాలలో డిసెంబరులో చేపడతామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

లోకేష్

లోకేష్

పార్టీ సభ్యత్వ నమోదు బ్రోచర్‌ను పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులతో కలిసి ఆవిష్కరించారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిధి ప్రారంభించామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.

లోకేష్

లోకేష్

సభ్యత్వం నమోదు అయ్యాక వారం రోడుల్లో సభ్యత్వ కార్డులు పంపిస్తామన్నారు. ఈసారి పేపర్ లెస్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. అందరికీ ట్యాబ్‌లు ఇచ్చినట్లు తెలిపారు.

English summary
At his maiden press conference here on Thursday, Nara Lokesh, TDP’s coordinator for cadre welfare and son of party supremo N. Chandrababu Naidu, said his party had set itself a target of enrolling 18 lakh to 25 lakh people in a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X