వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రి బంధువునని చెప్పి రూ. 3.37 కోట్లకు టోపి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్ర మంత్రి బంధవు అని నమ్మించి ఎల్ పీ జీ గ్యాస్ ఏజేన్సీ ఇప్పిస్తామని మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని భద్రావతి తాలుకా సిద్దాపురకు చెందిన అణ్ణాదూరై, పార్థిబన్, నాగరాజు అనే ముగ్గురిని శుక్రవారం రాత్రి భద్రావతిలో అరెస్టు చేసి పంజాబ్ తీసుకు వెళ్లారు.

పంజాబ్ లోని లూథియానలో రాకేష్ వర్మ నివాసం ఉంటున్నారు. ఈయన సెంట్రల్ సిల్క్ బోర్డు మాజీ సభ్యుడు. రాకేష్ వర్మను పరిచయం చేసుకున్న అణ్ణాదూరై తాము కేంద్ర మంత్రి అళగిరికి బంధువు అని పరిచయం చేసుకున్నాడు. నాగరాజ్ ను పిలుచుకుని వెళ్లి ఈయన ఐఎస్ అధికారి రాజేష్ శర్మ అంటు పరిచయం చేశారు. రాజేష్ శర్మ నిత్యం పెట్రోలియం శాఖ అధికారులతో సంప్రదిస్తుంటారని, ఆయనకు ఆశాఖలో మంచి పేరు ఉందని మాయమాటలు చెప్పారు.

3 People arrested for cheating Rs 3.37 Crore

తరువాత వీఐపీ కోటాలో మీకు ఎల్ పీజీ ఏజెన్సీ ఇప్పిస్తామని రూ. 92 లక్షలు తీసుకున్నారు. అదే విదంగా రాకేష్ వర్మ స్నేహితులను వీరు పరిచయం చేసుకున్నారు. వారికి ఎల్ పీజీ ఏజెన్నీ ఇప్పిస్తామని వారి దగ్గర రూ. 2.45 కోట్లు వసూలు చేసుకుని మాయం అయ్యారు. మోసం జరిగిందని గుర్తించిన రాకేష్ వర్మ లూథియాన కోర్టును ఆశ్రయించారు.

న్యాయస్థానం అనుమతితో పోలీసులు గాలించి అంతరాష్ట్ర మోసగాళ్లను అరెస్టు చేశారు. వీరు ఇతర రాష్ట్రాలలో ఇదే విదంగా మోసం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Three persons have been nabbed by Punjab police for cheating using union minister's name
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X