రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్

Telangana Lok Sabha polls 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది కూడా. వాటిని ఉససంహరించుకోవడానికి ఈ నెల 29వ తేదీ వరకు సమయం ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

Telangana Lok Sabha polls 2024 Malkajgiri received the highest no of nominations

కాంగ్రెస్ చేతిలో ఉన్న ముడుకు మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి భలే డిమాండ్ ఏర్పడింది. మొత్తం 17 నియోజకవర్గాల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలైంది మల్కాజ్‌గిరిలోనే కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం 177 నామినేషన్లు దాఖలయ్యాయి ఇక్కడ.

దీని తరువాత నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలు రెండో స్థానంలో నిలిచాయి. 114 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 109 నామినేషన్ పత్రాలతో పెద్దపల్లి లోక్‌సభ రెండో స్థానంలో నిలిచింది. అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తంగా 1,488 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.

ఆదిలాబాద్- 42, కరీంనగర్- 94, నిజామాబాద్- 90, జహీరాబాద్- 68, మెదక్- 90, సికింద్రాబాద్- 75, హైదరాబాద్- 85, చేవెళ్ల- 88, మహబూబ్‌నగర్- 72, వరంగల్- 89, మహబూబాబాద్- 56, ఖమ్మం- 72 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+