ఆ సినిమాలో అవకాశం అదృష్టంగా భావిస్తున్నా: సిమ్రాన్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్!
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సీనియర్ నటి సిమ్రాన్.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. గతేడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ఫామ్ లోకి వచ్చిన సిమ్రాన్.. తాజాగా ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'ధర్మన్' అనే భారీ ప్రాజెక్టులో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
బిగ్ కాంబినేషన్..రజినీ-కమల్-అశ్వత్ మారిముత్తు
ఈ సినిమా కు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిమత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ కమెడియన్ యోగిబాబు మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. ఇటీవల విడుదలైన రజినీకాంత్ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది.

'ధర్మన్' సినిమా గురించి సిమ్రాన్ కీలక వివరాలు
తాజాగా పాల్గొన్న కార్యక్రమంలో సీనియర్ నటి సిమ్రాన్ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం టీమ్ మొత్తం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తోందని.. వచ్చే నెల నుంచి తాను కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సిమ్రాన్ వెల్లడించారు. ఈ సినిమా ఖచ్చితంగా ఓ సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందని.. ప్రాజెక్టుపై తనకు 100 శాతం నమ్మకం ఉందని సిమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌పై ప్రశంసల జల్లు
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం పట్ల సీనియర్ నటి సిమ్రాన్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తాను ఆయనకు వీరాభిమానినని చెబుతూ.. రజినీకాంత్ ఎంతటి మహానటుడో.. వ్యక్తిగా అంతకంటే గొప్పవాడని సిమ్రాన్ కొనియాడారు. రజినీకాంత్‌లో ఏ మాత్రం అహంకారం కానీ.. ఈగో కానీ ఉండవని, అత్యంత నిరాండంబరమైన వ్యక్తిగా తన జీవితంలో రజినీకాంత్ ఆదర్శప్రాయుడని సిమ్రాన్ అన్నారు.
'పేట' జస్ట్ టీజర్ మాత్రమే!
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలని నటించిన సినిమా 'పేట' కేవలం ఓ టీజర్ లాంటిదని.. ఆయనతో పూర్తి స్థాయిలో పనిచేయాలనే తన డ్రీమ్ ఈ 'ధర్మన్' సినిమాతో నెరవేరబోతోందని సిమ్రాన్ పేర్కొన్నారు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో, సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి పని చేస్తున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని.. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావడం తాను ఎంతో గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు సిమ్రాన్ చెప్పుకొచ్చారు.
#Simran
— Movie Tamil (@_MovieTamil) July 30, 2026
- I'm very happy to have the opportunity to work with Super Star #Rajini I'm a huge fan of his, and he is such a humble person.
- I'm also grateful to be working under Kamal sir's production, which makes this opportunity even more special.#Dharman pic.twitter.com/I8fxgSmnTP













Click it and Unblock the Notifications