ఆ అంకుల్ ను నేను చేసుకోను.. ఇంట్లో నుంచి యువతి జంప్.. ప్రియుడితో ప్రత్యక్షమై..
హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతికి ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులు అంకుల్ వయసున్న వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. అయితే వయసులో చాలా పెద్ద అయిన ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని యువతి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ తర్వాత ప్రియుడ్ని వివాహం చేసుకుంది. ఇక ఈ ప్రేమ జంట కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తమ కుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. అలాగే తమ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లోని కిస్మత్ పూర్ లోని సన్ సిటీకు చెందిన అఫ్రీన్ షరీఫ్ డిగ్రీ చదువుతోంది. అయితే అఫ్రీన్ కు వరుసకు మేనమామ అయిన సయ్యద్ అథర్ తో వివాహం జరిపించాలని యువతి తల్లిదండ్రులు నిశ్చయించారు. అప్పటికే సయ్యద్ అథర్ కు వివాహం అయింది. అయితే ఆయన త్వరలోనే డివోర్స్ తీసుకోబోతున్నాడంటూ మాటలు చెప్పి అఫ్రీన్ తో వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ అందుకు అఫ్రీన్ అంగీకరించలేదు. తాను సోషల్ మీడియా ద్వారా సయ్యద్ అజాన్ అలీ అనే వ్యక్తిని ప్రేమించానని అతడ్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కానీ అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాక తనను కొట్టేందుకు కూడా ప్రయత్నించారని అఫ్రీన్ పేర్కొంది.
#Hyderabad: Afreen Shariff of Hydershahkote and Syed Azaan Ali of Baba Nagar entered into Nikah after meeting on social media five months ago. The couple married of their own choice and informed Kanchanbagh Police about their marriage. https://t.co/uaqrogexIz
— Deccan Daily (@DailyDeccan) November 27, 2026
" నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి సయ్యద్ అజాన్ అలీని వివాహం చేసుకున్నాను. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. మేమిద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నాం" అని అఫ్రీన్ స్పష్టం చేసింది. అలాగే ఆ జంట కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బంధువుల ఇంట్లో నిఖా ను పూర్తి చేసుకున్నారు. అయితే "తమకు ఏమైనా జరిగితే తమ కుటుంబమే కారణం" అని పేర్కొంది అఫ్రీన్. ఇక అఫ్రీన్- అజాన్ ఐదు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
