ఫస్ట్ రోజే బిగ్ షాక్..అన్నా నీ సినిమాకు ఇలాంటి పరిస్థితా..?
మాస్టర్ స్టోరీ టెల్లర్ సుకుమార్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో 2018 లో వచ్చిన మూవీ 'రంగస్థలం'.. అప్పటివరకూ తెలుగు తెరపై చూడని విధంగా రా అండ్ రస్టిక్, గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీని అత్యద్భుతంగా తెరకెక్కించారు సుకుమార్. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటిగా ఉంది. అయితే రంగస్థలం మూవీ తర్వాత అలాంటి బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఏవీ కూడా ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి గ్రామీణ పల్లె వాతావరణం, రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'భోగి'
అప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. లవ్ ట్రాక్ సినిమాలు చేసిన యువ నటుడు శర్వానంద్ ఇప్పుడు సడెన్ గా ట్రాక్ మార్చి భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'భోగి'.. ఈ మూవీ నవంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అలాగే డింపుల్ హయతి, శరత్ లోహితాశ్వ తదితరులు కీలక పాత్రలు చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోగి మూవీ తొలి రోజే బలహీనమైన వసూళ్లను రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో తొలి రోజు 2,064 షోల ద్వారా దాదాపు రూ. 1.90 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

భోగి మూవీ అటు ఓవర్సీస్ లోనూ అంతంత మాత్రంగానే ఆకట్టుకుంది. అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీకి కేవలం రూ.35 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో అటు భారత్, ఓవర్సీస్ కలిపి చూస్తే తొలి రోజున భోగి సినిమాకు రూ.2.53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. మరి ఈ వీకెండ్ నాటికి కలెక్షన్స్ పుంజుకుంటాయా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
