కట్నంలో కారు రాకపోయేసరికి కాపురం క్యాన్సిల్.. మూడు మాటలతో ముగించేసి భర్త పరార్!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కట్నంగా కారు డిమాండ్ తీర్చలేదన్న కారణంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్తపై పెళ్లయినప్పటి నుంచే దాడి చేయడంతో పాటు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళా ఐఏఎస్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. కటకటాల్లోకి ఎమ్మెల్యే!
మహిళా ఐఏఎస్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. కటకటాల్లోకి ఎమ్మెల్యే!

అసలేం జరిగిందంటే?
ఇండోర్‌లోని చందన్ నగర్ ప్రాంతానికి చెందిన అమ్రీన్ షేక్‌కు 2022లో ఉజేఫా షేక్‌తో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే భర్త తనను వేధించడం ప్రారంభించాడని బాధితురాలు ఆరోపించింది. పుట్టింటి నుంచి కారు తీసుకురావాలని ఒత్తిడి తెస్తూ.. కట్నంగా ఏమీ ఇవ్వలేదంటూ తనపై దాడి చేసేవాడని పేర్కొంది. అమ్రీన్ షేక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి పెళ్లిలో స్కూటీ ఇచ్చారు. అయితే కారు ఇచ్చే ఆర్థిక స్థోమత వారికి లేకపోయినా.. భర్త మాత్రం కారు కోసం పట్టుబడుతూనే ఉన్నాడు. డిమాండ్ తీర్చకపోతే తనతో కాపురం చేయనని బెదిరించేవాడని ఆరోపించింది.

Husband Gives Triple Talaq Over Unmet Car Dowry Demand in Indore Police Search On Full Details Here
రైల్వే స్టేషన్‌లో దారుణం: మరుగుదొడ్డిలోకి చొరబడి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
రైల్వే స్టేషన్‌లో దారుణం: మరుగుదొడ్డిలోకి చొరబడి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

కారు రాకపోవడంతో ట్రిపుల్ తలాక్
కారు తీసుకురాకపోవడంతో భర్త తనతో ఉండేందుకు నిరాకరించి ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన చందన్ నగర్ పోలీసులు నిందితుడైన భర్తపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమ్రీన్ షేక్ ఫిర్యాదు మేరకు ఉజేఫా షేక్ పై వరకట్న వేధింపులు, ట్రిపుల్ తలాక్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ రాజేశ్ దండోతియా వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+