రోహిత్‌ను ఒప్పించింది ఎవరు? ముంబై కెప్టెన్సీ వెనుక అసలు ట్విస్ట్ ఇదే!

ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టుకు వెళ్లిన నేపథ్యంలో ఫ్రాంచైజీ తమ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌కు మరోసారి పగ్గాలు అప్పగించింది. అయితే ముందుగా మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా లేనని.. జట్టు యజమాని ఆకాశ్ అంబానీతో చర్చించిన తర్వాత ఆలోచించి ఈ సవాల్‌ను స్వీకరించానని రోహిత్ శర్మ వెల్లడించారు.

IPL 2027: హార్దిక్‌కు గుడ్‌బై.. రోహిత్‌కు మళ్లీ జై! ముంబై ఇండియన్స్ బిగ్ డెసిషన్!
IPL 2027: హార్దిక్‌కు గుడ్‌బై.. రోహిత్‌కు మళ్లీ జై! ముంబై ఇండియన్స్ బిగ్ డెసిషన్!

ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా హ్యాండిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఆకాశ్ అంబానీ తనను కలిశారని తెలిపారు. ఆ సంభాషణలో మళ్లీ కెప్టెన్సీ చేస్తారా అని అడిగారని చెప్పారు. "నేను ప్రస్తుతం దానికి సిద్ధంగా లేనన్నది నా నిజాయితీ అభిప్రాయం. ఇంటికి వెళ్లి దీనిపై ఆలోచించాల్సి వచ్చింది. గత కొంతకాలంగా చాలా విషయాలు జరిగాయి. మానసికంగా ఈ బాధ్యతకు నేను సిద్ధంగా ఉన్నానో లేదో నాకు తెలియలేదు" అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఈ విషయంపై తమ భార్యతో కూడా చర్చించానని రోహిత్ శర్మ చెప్పారు. కొంత సమయం ఆలోచించిన తర్వాత ముంబై జట్టు ముందుకు సాగాలంటే సరైన దిశానిర్దేశం అవసరమని భావించానని వెల్లడించారు. జట్టుకు లీడర్‌గా తన అవసరం ఉందని తాను అనడం లేదని.. కానీ జట్టుకు ఓ దిశ అవసరమని రోహిత్ శర్మ స్పష్టం చేశారు.

Rohit Sharma Opens Up on Mumbai Indians Captaincy Return Initial Hesitation and New Vision Full Details

గత సీజన్లలో నిరాశ.. కొత్త ఆలోచనలు
రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది 2023 సీజన్ తర్వాత హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా.. ఆశించిన స్థాయిలో నిలకడైన ఫలితాలు రాలేదు. 2024లో పదో స్థానంలో, 2026లో తొమ్మిదో స్థానంలో నిలిచిన ముంబై.. 2025లో క్వాలిఫయర్-2 వరకు చేరింది. గత కొన్ని సీజన్లలో జట్టు ప్రదర్శన పట్ల ఆటగాళ్లు కూడా నిరాశకు గురయ్యారని రోహిత్ శర్మ అంగీకరించారు. కేవలం ప్లేఆఫ్స్ కు చేరలేదన్న బాధ మాత్రమే కాదని.. స్టేడియంలో తమ సామర్థ్యానికి, బాధ్యతకు తగినట్లు ఆడలేకపోవడమే అసలు కారణమని అన్నారు. ఈ నిరాశ ఒక్క ఆటగాడికే పరిమితం కాదని చెప్పారు.

Ind vs NZ: న్యూజీలాండ్ లో టీమిండియా మరో చరిత్ర- 96 ఏళ్లలో ఇదే తొలిసారి..!
Ind vs NZ: న్యూజీలాండ్ లో టీమిండియా మరో చరిత్ర- 96 ఏళ్లలో ఇదే తొలిసారి..!

కెప్టెన్సీకి తిరిగి వచ్చిన నేపథ్యంలో కొత్త సీజన్ కోసం తన ప్రణాళికలను రోహిత్ శర్మ పంచుకున్నారు. ప్లేయర్లపై మొదటి నుంచే టైటిల్ ఒత్తిడి ఉండకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. డ్రెస్సింగ్ రూంలో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడం, ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించడమే తమ ప్రాధాన్యత అని చెప్పారు. "నేను పాటించాలనుకుంటున్న ఒక విషయం ఏమిటంటే.. ట్రోఫీ గురించి అస్సలు మాట్లాడకూడదు. ట్రోఫీ ఇంకా చాలా దూరంలో ఉంది. ముందుగా మనం ఆటను ఆస్వాదించాలి" అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఐదు ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పటికీ.. పాత విజయాల మీదే ఆధారపడకూడదని రోహిత్ శర్మ అన్నారు. గత ఆరేళ్లలో ఫ్రాంచైజీ నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శన రాలేదని పేర్కొంటూ.. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుని జట్టును కొత్తగా, బలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రోహిత్ శర్మ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+