డీ లిమిటేషన్ తో ఏపీలో అడ్వాంటేజీ ఎవరికి- అసలు లెక్క..!!

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం లాంఛనంగా మారుతోంది. పూర్తి మెజార్టీ సాధించటంలో బీజేపీ నేత లు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ వ్యతిరేకించినా.. డీఎంకే, ఎన్సీపీ మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందటం ఖాయమనే భావిస్తున్నారు. నియోజకవర్గాల పెంపు- మహిళా రిజర్వేషన్లతో ఏపీలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో ఈ కొత్త లెక్కలతో రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుందనే విశ్లేషణలో ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. అసలు లెక్క ఏంటనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

డీలిమిటేషన్ ద్వారా ఏపీలో ఎంపీ స్థానాలు 25 నుంచి 39కి, అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 262 కు పెరగనున్నాయి. అదే విధంగా మహిళా రిజర్వేషన్ల తో మహిళలకు 33% కోటా కింద 86 లేదా 87 సీట్లు కేటాయించే వెసులుబాటు కలుగుతుంది. ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది. మూడు పార్టీల నుంచి ప్రతీ ఎన్నికల్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2024 లో మూడు పార్టీల్లోనూ చాలా మంది ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు సీట్ల పెంపు ద్వారా కూటమిలోని మూడు పార్టీల్లో కొంత వరకు ఆశావాహులకు అవకాశం దక్కుతుందనే చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పునర్విభజన జరగనుంది. దీంతో.. ప్రస్తుతం ఉన్న వాటిల్లో కొన్ని రద్దయి.. కొత్తగా మరి కొన్ని ఏర్పడే అవకాశం ఉంది. అదే విధంగా మహిళా రిజర్వేషన్ల కారణంగా ఈ సారి భారీగా మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.

 ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, లిస్టు - కీలక నేతల స్థానాలు ఇక వారికే..!!
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, లిస్టు - కీలక నేతల స్థానాలు ఇక వారికే..!!
delimitation-will-the-ruling-alliance-or-ysrcp-benefit-more-from-constituency-expansion

భిన్న అంచనాలు.. లెక్కలు

కాగా, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు తమకు బలంగా మారే అవకాశం ఉంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు. సహజంగా అధికార పార్టీపై ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. అదే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తమకు అనుకూలమై నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంద ని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందనే వాదన ఉన్నా.. కాంగ్రెస్ కొన్ని సీట్ల మార్పుతో నష్టపోయిన సంగతీ గుర్తు చేస్తున్నారు. వైసీపీ సైతం ఈ డీలిమిటేషన్ కు మద్దతి ఇస్తోంది. అధికారంలో ఉన్న వారికి డీలిమిటేషన్ అనుకూలమనే వాదనతో వైసీపీ విభేదిస్తోంది. 2009 లో కొత్త నియోజకవర్గాలతో పాతవి రద్దు కావటంతో కాంగ్రెస్ కు జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గం హద్దులు, పేరు మారినా ఓటరు మారరని విశ్లేషిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు డీలిమిటేషన్ లో జరిగే మార్పులు.. రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+