డీలిమిటేషన్ వేళ కాంగ్రెస్ కు బేజేపీ ఊహించని షాక్ - మారిన లెక్కలు, 2029కి రాచబాట..!!

డీలిమిటేషన్ బిల్లు వేళ ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. విపక్షాలే టార్గెట్ గా బీజేపీ పక్కాగా ప్లాన్ అమలు చేస్తోంది. ఇండియా కూటమి పార్టీలే ఇప్పుడు బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించినా.. కాంగ్రెస్, బిల్లును సభలో ఆమోదం పొందకుండా అడ్డు కోవటం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో 2029కి బీజేపీ రాచబాట వేసుకునేందుకు ఈ బిల్లు వేళ పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోంది.

డీలిమిటేషన్ బిల్లు వేళ బీజేపీ వ్యూహం ఫలించింది. బిల్లు ఆమోదం లాంఛనంగా కనిపిస్తోంది. ఆమోదానికి కావాల్సిన మెజార్టీ దాదాపు చేరుకుంది. డీఎంకే, ఎన్సీపీ మద్దతుతో పాటుగా ఆప్, టీఎంసీ చీలిక ఎంపీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందుతుందనే ధీమా కనిపిస్తోంది. కాగా, ఈ బిల్లును కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. అయినా.. డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం దక్కటం ఖాయమని చెబుతున్నారు. బీజేపీ పక్కా లెక్కతో కార్యాచరణ అమలు చేసింది. డీఎంకే, ఎన్సీపీ హామీతోనే కేబినెట్ లో బిల్లు ఆమోదించి.. ఆ తరువాత ఎవరిలోనూ అపోహలు లేకుండా 50 శాతం మేర అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

డీలిమిటేషన్ బిల్లు పై కాంగ్రెస్ సంచలన నిర్ణయం, కీలక మలుపు..!!
డీలిమిటేషన్ బిల్లు పై కాంగ్రెస్ సంచలన నిర్ణయం, కీలక మలుపు..!!
dmk-ncp-support-changes-majority-numbers-for-delimitation-bill-here-the-details

బీజేపీ టార్గెట్ 2029

ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారీ ఊరట లభించింది. సవరించిన ప్రతిపాదనలకు డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ మద్దతు ప్రకటించడంతో లోక్‌సభలో అధికార కూటమి బలం సుమారు 320 నుంచి 350 ఎంపీలకు చేరువైంది. అయితే, ప్రస్తుత లోక్‌సభలో ఉన్న 540 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే, బిల్లు ఆమోదానికి ప్రభుత్వానికి 360 ఓట్లు అవసర మవుతాయి. అంటే ఇంకా 10 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఓటింగ్ సమయంలో సభకు హాజరై ఓటు వేసే సభ్యుల సంఖ్య ఆధారంగా ఈ తుది మెజారిటీ లెక్క మారనుంది. లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, 8 మంది ఎంపీలు ఉన్న ఎన్సీపీ (ఎస్పీ) కూడా డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా బీజేపీ వ్యూహంలో భాగంగా ఇండి కూటమిలో మెజార్టీ సీట్లు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కు దూరం కావటంతో పాటుగా.. 2029 ఎన్నికలకు బీజేపీకి రాచబాట గా రూట్ క్లియర్ చేసుకోవటంలో వేస్తున్న అడుగులు ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+