పాకిస్తాన్ స్పేస్ టెక్నాలజీతో భారత రక్షణకు సవాల్: సీడీఎస్ హెచ్చరిక

పాకిస్తాన్ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా విస్తరిస్తోందని, ఈ పరిణామం భారత రక్షణ వ్యవస్థకు సవాల్ గా మారిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ సుపార్కో ద్వారా స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు చైనా, టర్కీల నుంచి కూడా సాంకేతిక సహకారం పొందే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన సైనిక అంతరిక్ష సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకోవడం, దాన్ని వేగవంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

సరిహద్దుల సమీపంలో మారుతున్న అంతరిక్ష భద్రతా సమీకరణాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీడీఎస్ స్పష్టం చేశారు. చైనా వద్ద ఉన్న అధునాతన ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రీకాన్సన్స్ టెక్నాలజీ, నేవిగేషన్ సిస్టమ్ వల్ల ఎలాంటి సమాచారం అయినా పాకిస్తాన్‌కు సులభంగా అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక కదలికలను నిశితంగా పరిశీలించే సామర్థ్యం ఆ దేశానికి లభిస్తుందని, ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

CDS Raja Subramani flagged Pakistan growing space capabilities backed by China and potentially Turkey

ఉపగ్రహాల ప్రయోగాల విషయంలో చైనాతో నేరుగా పోటీ పడాల్సిన అవసరం భారత్‌కు ఇప్పటివరకు రాలేదని, సరిహద్దు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించడానికి, రీవిజిట్ సమయాన్ని తగ్గించడానికి అవసరమైన శాటిలైట్ నెట్‌వర్క్ మన వద్ద ఉంటే సరిపోతుందని సీడీఎస్ సుబ్రమణి స్పష్టం చేశారు. శతృవుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి వీలుగా తగిన సంఖ్యలో డిఫెన్స్ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నామని ఆయన వెల్లడించారు.

తిరుమలలో 60 గ్రాముల బంగారం రికవరీ
తిరుమలలో 60 గ్రాముల బంగారం రికవరీ

భారత ఉపఖండంలో భద్రతపరంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనడానికి, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఇప్పటికే స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్-3 ని వేగవంతం చేశామని సీడీఎస్ వివరించారు. రూ. 26,968 కోట్ల ప్రాజెక్టు కింద రాబోయే మూడేళ్ల కాలంలో 52 ఆర్మీ సర్వైలెన్స్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కేంద్ర కేబినెట్ భద్రతా కమిటీ ఆమోదం పొందిన ఈ ప్రాజెక్ట్ ను డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ పర్యవేక్షిస్తోందని వివరించారు.

అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు
అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు

అంతరిక్షంలో శాటిలైట్ సిగ్నల్స్ ను నిరోధించే ఎలక్ట్రానిక్ పరికరాలు, శతృదేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి యాంటీ శాటిలైట్ టెక్నాలజీని చైనా శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ వ్యవస్థను కాపాడుకుంటూనే, స్పేస్ టెక్నాలజీని చైనాకు ధీటుగా బలోపేతం చేసుకోవడం అత్యంత కీలకమని సీడీఎస్ పేర్కొన్నారు. ఈ 52 సర్వైలెన్స్ శాటిలైట్ల ద్వారా పొరుగు దేశాల నుంచి వచ్చే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+