అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు

తమిళనాడు మధురై జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపత్తూన్ రాతి స్తంభం వద్ద నేడు కార్తీకదీపం వెలగబోతోంది. ఈ దీపాన్ని వెలిగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా సీఆర్‌పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం సాగనుంది.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికి సీఆర్‌పీఎఫ్ బలగాలు అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరుకున్నాయి. స్థానిక పోలీసులతో కలిసి కొండ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. కొండపైకి వెళ్లే ప్రవేశ మార్గాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సంయుక్తంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల ప్రకారం భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

CRPF undertakes Thiruparankundram security and surveillance duties hill area lit at Deepathoon today

తిరుప్పరంకుండ్రం చేరిన సీఆర్పీఎఫ్ అధికారులు, బలగాలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వారి వాహనాలపై పూలు చల్లారు. సుబ్రహ్మణ్యస్వామి మంత్రాలను పఠించారు. సీఆర్పీఎఫ్, సుప్రీంకోర్టుకు జేజేలు పలికారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఇక్కడికి వస్తోన్నాయని తెలిసిన తర్వాత తాము నిద్రపోలేదని, వారి రాకకోసం ఎదురు చూస్తూ గడిపామని స్థానికు తెలిపారు.

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం

తిరుప్పరంకుండ్రం కొండపై చారిత్రాత్మక సికిందర్ బాద్షా దర్గాకు సమీపంలోనే ఈ దీపత్తూన్ రాతి స్తంభం ఉంది. వార్షిక కార్తీక దీపోత్సవంలో భాగంగా నవంబర్ 24న అక్కడ దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధురై జిల్లా కలెక్టర్ కూడా కోర్టుకు ఈ మేరకు హామీ ఇచ్చారు. భద్రతా కారణాలను చూపుతూ స్థానిక యంత్రాంగం దీపత్తూన్ వద్ద కాకుండా కొండపై ఉన్న ఉచ్చి పిళ్లైయార్ ఆలయం సమీపంలో మహా దీపాన్ని వెలిగించడంతో వివాదం రాజుకుంది.

కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!
కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!

తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినా ఆదేశాలు పాటించకపోవడం ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారణేనని వ్యాఖ్యానించింది. అందుకే నేడు భక్తుల సమక్షంలోనే దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. దానికి సీఆర్‌పీఎఫ్ బలగాల రక్షణ కల్పించాలని ఆదేశించింది.

డీలిమిటేషన్ వల్ల ఈ నాలుగు రాష్ట్రాలకు గోల్డెన్ ఛాన్స్: సీట్ల నిష్పత్తి
డీలిమిటేషన్ వల్ల ఈ నాలుగు రాష్ట్రాలకు గోల్డెన్ ఛాన్స్: సీట్ల నిష్పత్తి

ఈ ఉత్తర్వులు ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తాయి. కొండపై ఉన్న స్థలం యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదాలకు ఈ తాత్కాలిక అనుమతి ప్రాతిపదిక కాదని తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన హక్కుల నిర్ణయం భవిష్యత్తు విచారణపై ఆధారపడి ఉంటుందని, ఇప్పటికైతే కోర్టు ఆదేశాలను అమలు చేయడమే ముఖ్యమని తెలిపింది. దీపం వెలిగించడానికి మాత్రమే తమ ఆదేశాలు పరిమితమై ఉంటాయని కూడా ధర్మాసనం తేల్చింది.

దీపత్తూన్ వద్ద దీపం వెలిగించడంపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 20న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దర్గా సమీపంలో దీపం వెలిగించడం వల్ల మతపరమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. అయినప్పటికీ, మునుపటి ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు, కేంద్ర బలగాల సమక్షంలోనే దీపోత్సవం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+