డీలిమిటేషన్ వల్ల ఈ నాలుగు రాష్ట్రాలకు గోల్డెన్ ఛాన్స్: సీట్ల నిష్పత్తి

దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చ మొదలైంది. లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. డీలిమిటేషన్ బిల్లును ఆమోదించబోతోంది. అనంతరం ఈ నెల 30వ తేదీన లోక్ సభలో దీన్ని ప్రవేశపెడుతుంది.

జనాభా లెక్కలతో ముడిపెట్టకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం మేర సమానంగా పెంచాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది.మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులను తొలగించడంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్‌సభ స్థానాల సంఖ్యను సమానంగా 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది.

Proposed 50 percent increase in Lok Sabha seats could reshape India parliamentary landscape big states

ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్య 543 కాగా.. ప్రతిపాదిత 50 శాతం పెంపు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల లోక్ సభ సీట్ల పరంగా అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు భారీగా లబ్ది పొందే అవకాశం ఉంది. ఫలితంగా జాతీయ రాజకీయాల్లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యత, ప్రాబల్యం, సీట్ల బలం మరింత అధికమౌతాయి. ఈ నాలుగు కూడా ఉత్తరాదికి చెందిన బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సడన్ గా డీలిమిటేషన్ పై మారిన కేంద్రం మైండ్ సెట్- రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు?
సడన్ గా డీలిమిటేషన్ పై మారిన కేంద్రం మైండ్ సెట్- రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు?
  • దీని ప్రకారం చూస్తే.. రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్ సభ స్థానాలను కేంద్రం కేటాయిస్తుందని తెలుస్తోంది.
  • ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. 50 శాతం ప్రాతిపదికన సీట్లను పెంచితే ఈ సంఖ్య వంద దాటుతుంది. ఏకంగా 120కి చేరుతుంది.
  • అలాగే మహారాష్ట్ర కూడా. 48 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న రెండో అతి పెద్ద రాష్ట్రం ఇది. 50 శాతం ప్రాతిపదికన సీట్ల పంపకాలు జరిగితే ఇక్కడున్న స్థానాల సంఖ్య 72కు పెరుగుతుంది.
  • పశ్చిమ బెంగాల్ లో కూడా సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి సంక్య 63 కు చేరుకుటుంది.
  • లోక్ సభలో 40 స్థానాలు ఉన్న బీహార్ ముఖచిత్రం కూడా సమూలంగా మారిపోతుంది. ఇక్కడ 20 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 40 ఉన్న లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 60కి చేరుతుంది.
పడి లేచిన బంగారం ధరలు- నూతన ఊపు
పడి లేచిన బంగారం ధరలు- నూతన ఊపు

ఈ డిలిమిటేషన్ ప్రతిపాదనలపై నిరసనలు వ్యక్తమౌతోన్నాయి. జనాభా నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పులపై ఆందోళన చెందుతున్నాయి. ఆ ప్రాతిపదికనే సీట్లు పెంచితే, జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు దక్కుతాయని, దానివల్ల పార్లమెంట్‌లో తమ ప్రాతినిథ్యం తగ్గితుందనే వాదన ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+