టీడీపీ చేతిలో ఓడిన జనసేన నేత తల్లి..! ఇంకా ఎన్నికలెందుకని కన్నీళ్లపర్వం...!

ఏపీలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఇక్కడ సర్పంచ్ సీటును స్థానిక జనసేన ఇన్ ఛార్జ్ కోట వినుత (Vinutha Kotaa) తల్లి నగరం జయలలితకు కేటాయించారు. అయినా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆమెకు పోటీగా అభ్యర్ధిని నిలబెట్టారు. సదరు అభ్యర్ధిని ఉపసంహరించుకునేలా కోట వినుత ఇరు పార్టీల అధిష్టానాలకు చెప్పి ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలించలేదు.

Exit Poll: సీప్యాక్ ఎగ్జిట్ పోల్ సంచలనం- కూటమి, వైసీపీకి దక్కే సీట్లు ఇవే..!
Exit Poll: సీప్యాక్ ఎగ్జిట్ పోల్ సంచలనం- కూటమి, వైసీపీకి దక్కే సీట్లు ఇవే..!

చివరికి కోట వినుత తల్లి జయలలిత ఇక్కడ టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. దీనిపై కోట వినుత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. తనకు తెలిసి ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా, ఏం చేశారో అర్దం కాకుండా మ్యానేజ్ చేశారంటూ మిత్రపక్షం టీడీపీపై ఆమె విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్ని ఏకగ్రీవం కాకుండా తమ బతుకుల్ని మార్చేందుకు ఓ అభ్యర్ధి వచ్చి నిలబడినప్పుడు, ఆమెకు వ్యతిరేకంగా, అసలు ప్రచారమే చేయకుండా టీడీపీ అభ్యర్ధి గెలవడంపై కోట వినుత అసహనం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నందున తామే గెలుస్తామంటూ టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి రెండు రోజుల క్రితమే చెప్పుకున్నారని ఆమె గుర్తుచేశారు. అటువంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఏం చేసుకోవాలో చేసుకోవచ్చు కదా.. ఎన్నికలు ఎందుకన్నారు.

Janasena Leader Kota Vinutha s Sharp Attack on TDP After Mother s Poll Defeat

రాజకీయాల్లోకి రావాలనుకునే యువత .. వీళ్ల కాళ్ల కింద ఇలా బతకడానికి సిద్ధమైతేనే రావాలని ఆమె సలహా ఇచ్చారు. స్దానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ ఎన్నికను వ్యక్తిగతంగా తీసుకుని, ఇదీ మీ స్ధానం అని చెప్పేందుకు ప్రయత్నించాడన్నారు. మీ పార్టీలో ఉన్న స్పీకర్, ఇతర నేతల భార్యలు సర్పంచ్ లుగా పోటీ చేసి ఓడిపోయారని బొజ్జల సుధీర్ రెడ్డికి కోట వినుత గుర్తుచేశారు. ఈ విజయం చూసుకుని విర్రవీగవద్దంటూ సూచించారు. అసలు ప్రచారం కూడా చేయకుండా వీళ్లు ఎలా గెలిచారో ఏఐ కూడా కనిపెట్టలేదన్నారు. బూత్ లోకి యథేచ్ఛగా టీడీపీ నేతలు పది, ఇరవై మంది వెళ్లిపోతున్నారని, జనసేన వాళ్లు అక్కడ నిలబడేందుకు సైతం ఒప్పుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ పరిస్ధితి మారాలన్నారు.

Janasena Leader Kota Vinutha s Sharp Attack on TDP After Mother s Poll Defeat
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!

ఇలాంటి ఎన్నికలు జరిగితే ప్రజల తీర్పు ఇంత సులువుగా మార్చేయవచ్చని నిరూపించారన్నారు. ఒంటి గంటకే పోలింగ్ నిలిపేసి, 2 గంటల వరకూ లంచ్ బ్రేక్ ఇచ్చి, 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారన్నారు. ఒక దాని తర్వాత ఒకటి బస్సులు వచ్చాయన్నారు. ఆ తర్వాత లోపల కట్టలు కట్టలుగా ఓట్లు కనిపించాయన్నారు. విజయం నిర్ణయం అయిపోయిందని, వాళ్ల పార్టీ ఆఫీసు వద్ద క్రాకర్స్ కూడా సిద్దం అయిపోయాయన్నారు. అసలు ఏం జరుగుతుందో తనకు అర్దం కాలేదన్నారు. ఎవరెంత ప్రచారాలు చేసుకున్నా ఎమ్మెల్యే తమకు మాటిచ్చారని టీడీపీ అభ్యర్ధి చెప్పుకున్నారని కోట వినుత తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బు, సమయం వృథా తప్ప ఇంకేమీ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+