డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందినా కొత్త నియోజకవర్గాలు అప్పుడే..!? ఢిల్లీ బిగ్ ట్విస్ట్..!!
డీలిమిటేషన్ బిల్లుకు రంగం సిద్దం అయింది. ఇందుకు ముహూర్తం ఖరారు అయింది. మద్దతు కోసం ఇండి కూటమిలోని ప్రధాన పార్టీలను తమ వైపు తిప్పుకోవటంతో అనూహ్య పరిణామాలు జరిగితే మినహా మహిళా రిజర్వేషన్ - డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగే ప్రక్రియ.. 2029 నాటికి కొత్త నియోజకవర్గాల ఏర్పాటు పూర్తి అవుతుందా అనే సందేహం వినిపిస్తోంది. ఇదే అంశం పైన బీజేపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రక్రియ పూర్తి చేయటం పైనా స్పష్టత ఇస్తున్నారు.
ఢిల్లీ కేంద్రంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరులో రిజర్వేషన్ తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్ లో ఇదే బిల్లు వీగిపోవటంతో ఈ సారి ఎలాగైనా ఆమోదం దిశగా మంత్రాంగం సాగుతోంది. ఇండి కూటమిలోని ఎన్సీపీ, డీఎంకే, సమాజ్ వాదీ షరతులతో మద్దతుగా అంగీకారం తెలిపాయని సమాచారం. ఇదే సమయంలో జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రతీ రాష్ట్రంలో యాభై స్థానాలు పెంపు ప్రతిపాదనతో ఈ పార్టీలు మద్దతుకు ముందుకు వచ్చాయి. కాగా.. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న ప్రస్తుతం ఉన్న 543 నుండి 815 లేదా గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. కాగా, ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో పెరిగిన సీట్లలో మహిళలకు 33% కోటా సీట్లు కేటాయించే వెసులుబాటు కలుగు తుంది. అయితే, బిల్లు ఆమోదం పొందితే.. తరువాత ప్రక్రియ కీలకం కానుంది.

అమలు 2029 లో సాధ్యమేనా..!?
కేంద్రం నియోజకవర్గాలు పెంచాలంటే ముందుగా నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉంటుంది. కేంద్రం నియమించే కమిటీ పార్టీలు.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి నివేదిక సమర్పిస్తోంది. ఈ నివేదికే కొత్త నియోజకవర్గాల ఖరారులో కీలక పాత్ర పోషించ నుంది. అయితే, సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయటానికి రెండేళ్ల నుంచి రెండున్నారేళ్ల సమయం పడుతోంది. 2002 డీలిమిటేషన్ కమిషన్. 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002 జూలైలో ఏర్పాటైన ఈ కమిషన్ తన తుది ఉత్తర్వులను ఇవ్వడానికి సుమారు 6 సంవత్సరాల 4 నెలల సమయం తీసుకుంది. దీని సిఫార్సులు 2008లో ఖరారై, 2009 సాధారణ ఎన్నికల నుండి అమల్లోకి వచ్చాయి. ఇక... ఇప్పుడు మాత్రం కేంద్రం 2029 ఎన్నికల నాటికే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త నియోజకవర్గాలతో ఎన్నికలు వెళ్లాలనే పట్టుదలతో ఉంది. న్యాయ - సాంకేతికంగా ఇబ్బందు రాకుంటే 2029 నాటికే పక్రియ పర్తి అవుతుందని చెబుతున్నారు. దీంతో... అసలు కేంద్రంలో బిల్లు ఆమోదం.. 2029 లోగా ప్రక్రియ పూర్తి ఇప్పుడు కీలకంగా మారనుంది. దీని ఆధారంగా 2029 ఎన్నికల రాజకీయం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
