రూపాయికి మరోసారి ఎదురుదెబ్బ.. వచ్చే సోమవారం చాలా కీలకం!
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ సాధిస్తున్న బలం, భారత్‌లో నెలవారీ దిగుమతుల చెల్లింపుల డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ మళ్లీ తగ్గింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 6 పైసలు క్షీణించి 92.50 వద్ద నిలిచింది. నిన్నటి ముగింపు ధర 92.44 కాగా, ఇవాళ ప్రారంభంలోనే కొంత ఒత్తిడి ఎదురైంది. స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు రూ. 5,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడులు తెచ్చినప్పటికీ, నెల చివరి దిగుమతుల డాలర్ డిమాండ్ ఎక్కువగా ఉండటమే ఈ క్షీణతకు కారణమని ఫైనాన్స్ విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రేడింగ్ సరళి ఎలా ఉండబోతోంది?
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. తొలత డాలర్‌తో రూపాయి ట్రేడింగ్ స్వల్పంగా తగ్గి పైకి లేచే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, నెల చివరి చెల్లింపుల డిమాండ్‌ను బట్టి రోజు ముగిసే సమయానికి రూపాయి 92.75 స్థాయి వరకు పడిపోయే అవకాశం ఉంది. అలాగే రాబోయే సోమవారం నాడు ఎమ్‌ఎస్‌సిఐ (MSCI) రీబ్యాలెన్సింగ్ వల్ల సుమారు 2 బిలియన్ డాలర్ల నిధుల రాక ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు రూపాయి తగ్గినప్పుడు డాలర్లను విక్రయించడానికి, దిగుమతిదారులు రూపాయి పుంజుకున్నప్పుడు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆసియా కరెన్సీల విలువ..
ఈ రోజు ట్రేడింగ్‌లో మిగతా ఆసియా దేశాల కరెన్సీలు కూడా మిశ్రమంగా స్పందించాయి. ఇండోనేషియా రుపియా 0.17 శాతం పడిపోగా, థాయ్ భట్ 0.07 శాతం తగ్గింది. మలేషియన్ రింగిట్, సింగపూర్ డాలర్, జపనీస్ యెన్ కూడా స్వల్పంగా నష్టపోయాయి. మరోవైపు చైనా రెన్మిన్బి 0.15 శాతం బలోపేతం కాగా, తైవాన్ డాలర్, ఫిలిప్పీన్ పెసో, సౌత్ కొరియన్ వోన్ కరెన్సీలు స్వల్పంగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ స్థిరత్వం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ట్రేడింగ్‌పై విశ్లేషకుల్లో ఏర్పడిన సందేహాలు, ఈక్విటీ మార్కెట్లలో ఉత్సాహం తగ్గడంతో డాలర్ ఇండెక్స్ 22 నెలల గరిష్ట స్థాయి కింద స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ విలువను కొలిచే డాలర్ ఇండెక్స్ 103.81 వద్ద స్థిరంగా ఉంది. వారంలో ఇది 104.53 వరకు వెళ్లినప్పటికీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంది. ఇతర కరెన్సీలైన యూరో $1.0964 వద్ద ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండగా, పౌండ్ స్టెర్లింగ్ $1.3099 కి పడిపోయింది.














Click it and Unblock the Notifications
