షర్మిల లెక్క తప్పిందా ? ఆ ముగ్గురు సీఎంలూ దూరం..! రీజన్ ఇదేనా..?

ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తాజాగా తన కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేదిక విషయంలో అన్న వైఎస్ జగన్ తో విభేదాల కారణంగా ఆయన్ను ఆహ్వానించని వైఎస్ షర్మిల.. నలుగురు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, విజయ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబును మాత్రం ఆహ్వానించారు. కానీ ఇందులో ముగ్గురు మాత్రం ఈ పెళ్లికి హాజరు కాకుండా మోహం చాటేశారు. చివరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పెళ్లికి వెళ్లలేదు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ షర్మిల కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని తమ కుటుంబ నివాసం యలహంక ప్యాలెస్ లో నిర్వహించాలని ఆమె ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అన్న జగన్ కు చెప్తే ఆయన భద్రతా కారణాలతో వద్దన్నారు. తాను పెళ్లి శుభలేఖలు కూడా వేయించేసుకున్నానని, ఇప్పుడు అడ్డుపడొద్దంటూ కోరినా వినలేదు. దీంతో ఈ కుటుంబ విషయాన్ని కాస్తా వైఎస్ షర్మిల రాజకీయ అంశంగా మార్చడం ప్రారంభించారు. దీనిపై లీకులు ఇవ్వడంతో టీడీపీ నేతలు, చంద్రబాబు విమర్శలకు దిగారు. అంతే కాదు వారి అనుకూల పత్రికలు పతాక శీర్షికల్ని అచ్చేశాయి. అదే సమయంలో నలుగురు ముఖ్యమంత్రుల్ని కలిసిన షర్మిల.. వారిని తన కుమార్తె పెళ్లికి రావాలని ఆహ్వానపత్రికలు ఇచ్చారు. అయినా వీరిలో రేవంత్ రెడ్డి, విజయ్, చంద్రబాబు ఈ పెళ్లికి హాజరు కాకుండా దూరంగా ఉండిపోయారు.

YS Sharmila-Jagan Family Rift Southern CMs Absent From Daughter s Wedding
పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహుర్తం ఫిక్స్- ఈ తేదీల్లో- మళ్లీ ఆ రెండు బిల్లులు..!
పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహుర్తం ఫిక్స్- ఈ తేదీల్లో- మళ్లీ ఆ రెండు బిల్లులు..!

దీంతో కేవలం కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో పాటు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులు మాత్రమే అంజిలీ రెడ్డి పెళ్లిలో కనిపించారు. వాస్తవానికి తన కాంగ్రెస్ పార్టీకే చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల కు మంచి సంబంధాలే ఉన్నాయి. విజయ్ కూడా కాంగ్రెస్ కు తమిళనాడుతో పాటు జాతీయ స్దాయిలో మిత్రుడిగా ఉన్నారు. ఇక జగన్ పై వ్యతిరేకత కొద్దీ వైఎస్ కు రాజకీయ శత్రువైన చంద్రబాబు కూడా షర్మిల కు మిత్రుడైపోయారు. దీంతో వీరంతా పెళ్లికి వస్తారని షర్మిల భావించినా అలా జరగలేదు. దీని వెనుక పలు రాజకీయ కారణాలున్నట్లు సమాచారం.

YS Sharmila-Jagan Family Rift Southern CMs Absent From Daughter s Wedding
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

ఇందులో షర్మిల ఈ పెళ్లిని వ్యక్తిగత విషయంగా కాకుండా రాజకీయ అంశంగా మార్చేయడం ప్రధానమైనది. తద్వారా ఈ పెళ్లికి హాజరైతే జగన్ తో విరోధం తెచ్చుకున్నట్లే అని విజయ్ వంటి వారు భావించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి, ఆయన మాజీ గురువు చంద్రబాబు కూడా తమదైన రాజకీయ కారణాలతోనే ఈ పెళ్లికి వెళ్లలేదని సమాచారం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జగన్ ను అక్కున చేర్చుకుంటే తమకు ఇబ్బందులు తలెత్తకుండా వీరంతా వ్యూహాత్మకంగా వ్యవహరించారా అన్న చర్చ కూడా నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+