కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

తన మాజీ బాస్ వైఎస్ జగన్ పై పరివర్తన్ రాజనీతి పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు రావడం, ఆయనతో కలిసి తాను జైలుకు వెళ్లడం, వైఎస్సార్సీపీలో నంబర్ టూ కావడం, బీజేపీ-వైసీపీ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడం ఇలా పలు కీలక అంశాల్ని ఆయన ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. బీజేపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం మధ్య ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నందమూరి అలేఖ్యకు పీఆర్పీలో కీలక పదవి..! సాయిరెడ్డి వెల్లడి..!
నందమూరి అలేఖ్యకు పీఆర్పీలో కీలక పదవి..! సాయిరెడ్డి వెల్లడి..!

కాంగ్రెస్ పార్టీకి జగన్ వెన్నుపోటు పొడిచారని విజయసాయిరెడ్డి ఇవాళ ఆరోపించారు. తనను వెన్నుపోటుదారు అంటున్న వైసీపీ నేతలు ఎవరు వెన్నుపోటుదారులో తెలుసుకోవాలంటూ చురకలు అంటించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం పదవి డిమాండ్ చేశారని, దానికి సోనియాగాంధీ నిరాకరించడంతో కాంగ్రెస్ ఇచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేశారని సాయిరెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత వైసీపీని నిలబెట్టేందుకు తాను పడ్డ కష్టానికి ఫలితంగానే పార్టీలో నంబర్ టూ పదవి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. జగన్ తో పాటు జైల్లో ఉన్నానని, తన కష్టాన్ని చూసి మాత్రమే ఈ పదవి ఇచ్చినట్లు సాయిరెడ్డి తెలిపారు.

Jagan Backstabbed Congress Vijayasai Reddy Claims He Mediated Between YSRCP And BJP
మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!
మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!

అయినా పార్టీ వ్యవహారాల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయమని చెప్పారని, అడుగడుగునా తనను అవమానించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బీజేపీ-వైసీపీ మధ్య సంధానకర్తగా ఉన్న తనను తప్పించారని, అందుకే తాను అవమానంగా భావించి పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. జగన్ కు తెలిసే ఇవన్నీ జరిగాయని, ఆయన చుట్టూ కోటరీ ఉందని, బయటి విషయాలు ఆయనకు తెలియకుండా చేస్తున్నారని సాయిరెడ్డి మరోసారి ఆరోపించారు. జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారంపై స్పందించేందుకు సాయిరెడ్డి నిరాకరించారు. అది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం అన్నారు. వైఎస్ కుటుంబ వ్యవహారాలు తనతో పాటు వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు మాత్రమే తెలుసని విజయసాయి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే తాను పాదయాత్ర చేస్తానని సాయిరెడ్డి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+