Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఫైట్ తరహాలో..!

భారత్ లో ప్రస్తుతం ప్రీమియర్ రైళ్లుగా పేరు తెచ్చుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ రైళ్లలో భోజనం నాణ్యతపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వీటిపై రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మూడు రూట్లలో అందుబాటులోకి తెచ్చిన వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైళ్లలో భోజనంలో కీలక మార్పులు చేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

తిరుపతి-విశాఖ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- జనవరి వరకూ ఈ రైళ్లు..!
తిరుపతి-విశాఖ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- జనవరి వరకూ ఈ రైళ్లు..!

సుదీర్ఘ ప్రయాణం చేసే వందే భారత్ స్లీపర్ రైళ్లలో తక్కువ వంటకాలతో, ఎక్కువ నాణ్యత గల ఆహారాన్ని ప్రయాణికులకు అందించేందుకు రైల్వే సిద్దమవుతోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విమానాల తరహాలో టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనంలో వంటకాల సంఖ్య తగ్గించి, నాణ్యతగా అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ కొత్త మెనూ అందిస్తారు. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్రీమియర్ రైళ్లకూ విస్తరిస్తారు.

Vande Bharat Sleeper Trains To Offer Flight-Style Meals On Three Routes

శబరిమల యాత్రికులకు రైల్వే అలర్ట్- తేడా వస్తే మూడేళ్ల జైలుశిక్ష..!
ప్రస్తుతం ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఐఆర్సీటీసీ టిఫిన్ గా చట్నీ సాంబార్ ఇడ్లీ, వడ లేదా పోహా, ఉప్మాను అందిస్తోంది. అలాగే మధ్యాహ్న, రాత్రి భోజనంలో చపాతీ, అన్నం, పప్పు, చికన్ లేదా కూరగాయల వంటకాలు ఉంటాయి. వీటి స్ధానంలో ఇప్పుడు మరింత రుచికరమైన, తక్కువ మెనూతో వంటకాలు అందిస్తారు. వీటిలో టిఫిన్ లో సూప్, ఎగ్ ఆమ్లెట్, శాండ్ విచ్, మజ్జిగ, చాక్లెట్లు, మధ్యాహ్న, రాత్రి భోజనాల్లో పొడి కూర, పెరుగు, సలాడ్, ఊరగాయ, స్వీట్లు ఉంటాయి. తాజా మార్పుల తర్వాతా ఒక పూట భోజనం మొత్తం బరువు 700-750 గ్రాముల నుంచి 450-500 గ్రాములకు తగ్గినట్లు రైల్వేవర్గాలు చెప్తున్నాయి. క్లౌడ్ కిచెన్ సదుపాయం అమలు చేయడం ప్రారంభించాక ప్రయాణికుల నుంచి భోజన ఫిర్యాదులు 10 శాతం తగ్గినట్లు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+