ఏపీ సొంత ఆదాయంలో భారీ వృద్ధి - ఇవీ లెక్కలు..!!

ఏపీకి సొంత ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.74,342 కోట్లకు చేరింది.స్పెషల్‌ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం గత ఏడాది ఇదే సమయానికి రూ.62,604 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 18.7 శాతం వృద్ధిగా అధికారులు తేల్చి చెప్పారు. జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయంలో పురోగతి కనిపించింది. ఆదాయ శాఖ ఆర్జన శాఖలకు సేవలు.. ఆదాయం పైన సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు.

ఏపీ సొంత ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.74,342 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 18.7 శాతం వృద్ధి నమోదైంది. ఈరోజు (బుధవారం) ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పన్నుల భారం లేకుండా, కొత్తగా ఛార్జీలు పెంచకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. పలు శాఖల్లో పారదర్శకత, ఆన్‌లైన్ విధానం, సంస్కరణల కారణంగా ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల కనిపించిందని చెప్పారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్లకు ఏఐ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలోని నాలుగు విభాగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఏఐ స్టాక్ వినియోగించామన్నారు. పన్ను రిటర్న్‌ల పరిశీలన, ఆడిట్‌, తనిఖీలు, న్యాయ వ్యవహా రాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్పెషల్‌ మార్జిన్‌తో కలిపి ఏపీ సొంత ఆదాయం రూ.74, 342 కోట్లకు చేరింది.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
ap-own-revenue-has-reached-rs-74-342-cr-with-18-7-growth-compared-to-the-last-year-details-here

గత ఏడాది కంటే పెరిగిన ఆదాయం

కాగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.11,738 కోట్లు అదనంగా ఆదాయ ఆర్జన జరిగింది. మొత్తంగా 18.7% వృద్ధి సాధించింది. స్పెషల్‌ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం గత ఏడాది ఇదే సమయానికి రూ.62,604 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఏడాదిలో రూ.74,342 కోట్లకు రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది. రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో నవంబర్‌ 23 నాటికే 58 శాతం సాధించినట్లు అధికారులు వివరించారు. రూ.10,104 కోట్ల మేర పన్ను ఆదాయం పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది ఇదే కాలానికి పన్ను ఆదాయం రూ.53,692 కోట్లు నమోదు కాగా.. ఈ ఏడాది రూ.63,796 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 18.8 శాతం వృద్ధి సాధించగా.... పన్నేతర ఆదాయంలో 31.3% వృద్ధి నమోదైనట్లు తెలిపారు. అలాగే వాణిజ్య పన్నుల ఆదాయం18.3 శాతం వృద్ధితో రూ. 5,917 కోట్లకు పెరుగుదల నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జీఎస్టీ ఆదాయం 18.1 శాతం వృద్ధితో రూ.3,694 కోట్ల మేర పెరిగిందన్నారు. స్పెషల్‌ మార్జిన్‌తో కలిపి ఎక్సైజ్‌ శాఖ ఆదాయం రూ.20,083 కోట్లకు చేరిందని చెప్పారు. 19.6 శాతం వృద్ధితో గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.3,287 కోట్ల మేర ఎక్సైజ్‌ శాఖ ఆదాయం పెరిగిందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+