బంగాళాఖాతంలో ద్రోణి, పిడుగులతో భారీ వర్షాలు: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

ఏపీలో మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెలాఖరు తో పాటుగా డిసెంబర్ రెండో వారం లో వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రం పైన ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు (బుధవారం) నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, భారీ హోర్డింగుల వద్ద నిలబడ వద్దని ప్రజలకు ఆర్టీజీఎస్ సూచించింది. వర్షాల కారణంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే.. అత్యవసర నంబర్ల కు కాల్ చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వాతావరణం మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షంతో రోడ్లపై మోకాలి లోతున నీరు నిలిచింది. నెల్లూరు లోనూ వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
ap-weather-alert-four-days-of-thunderstorms-expected-across-andhra-pradesh-details-here

వాతావరణ శాఖ తాజా అలర్ట్స్

కాగా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడవచ్చని పేర్కొంది. రేపు కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో రెవెన్యూ, విపత్తుల నిర్వహణ విభాగాలు పరిస్థితిని సమీక్షించనున్నాయి. పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను పాటించాలని అధికారులు కోరారు. కాగా, ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ రెండో వారం వరకు రెందు తుఫాన్లు రాష్ట్రం పైన ప్రభావం చూపుతాయనే అంచనాలతో యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+