నియోజకవర్గాల పెంపు వేళ చంద్రబాబు, పవన్ కు ఢిల్లీ పిలుపు - జగన్ తాజా నిర్ణయంతో..!!

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. కావాల్సిన మద్దతు కూడగట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న చంద్రబాబు, పవన్ ను ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అటు బిల్లు విషయంలో జగన్ నిర్ణయం ఆసక్తిగా మారుతోంది. దీంతో.. కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారా? హైపర్ ఆది వ్యాఖ్యలు వైరల్!
చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారా? హైపర్ ఆది వ్యాఖ్యలు వైరల్!

కేంద్రం మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల 30న పార్లమెంట్ సమావేశం కానుంది. 4వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదం పొందేలా మద్దతు కూడగడుతున్నారు. ఏప్రిల్ లో ఇదే బిల్లు సభలో వీగిపోయింది. ఇండి కూటమి లోని పార్టీల్లో వచ్చిన చీలిక పార్టీలు.. డీఎంకే మద్దతు తో ఇప్పుడు ఈ బిల్లులను ఆమోదించుకు నేందు కు కేంద్రం తుది కసరత్తు చేస్తోంది.

Chandrababu and Pawan Kalyan Receive Delhi Call Amid Centre s Key Bills in Parliament

దీంతో.. ఈ కీలక బిల్లుల వేళ ఎన్డీఏలో భాగస్వాములు గా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మధ్యాహ్నం ఇద్దరూ ఢిల్లీ వెళ్లనున్నారు. అటు వైసీపీ మద్దతు ఈ బిల్లుల విషయంలో కేంద్రానికి అవసరం అయింది. కేంద్ర సీనియర్ మంత్రి ఇప్పటికే జగన్ తో మద్దతు పై మాట్లాడినట్లు తెలుస్తోంది.

తిరుమల చరిత్రలో తొలిసారి, 121 కిలోల స్వర్ణాభరణాల కానుక- చంద్రబాబు సమక్షంలో..!!
తిరుమల చరిత్రలో తొలిసారి, 121 కిలోల స్వర్ణాభరణాల కానుక- చంద్రబాబు సమక్షంలో..!!

బిల్లులకు జగన్ మద్దతు ఇస్తూనే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనే విషయం పైన బిల్లు లో స్పష్టత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కాగా... బిల్లు ఆమోదం పొందితే ఏపీలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 25 నుండి 37 లేదా 38కి పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా శాసన సభ స్థానాలు ప్రస్తుతమున్న 175 నుండి 262 లేదా 263కి పెరగనున్నాయి.

కాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో ఏపీ అసెంబ్లీలో పెరిగిన సీట్లలో మహిళలకు 33% కోటా కింద 86 లేదా 87 సీట్లు కేటాయించే వెసులుబాటు కలుగుతుంది. ఈ బిల్లులను ఆమోదించి 2029 నాటికి అమలు చేసే విధంగా కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. దీంతో.. 2029 ఎన్నికల వేళ కొత్త నియోజకవర్గాలు.. పునర్విభజన ఏపీలో ఎవరికి అనుకూలంగా మారుతుందనే చర్చ మొదలైంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా... కొత్త రాజకీయ సమీకరణాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+