చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారా? హైపర్ ఆది వ్యాఖ్యలు వైరల్!

రాజకీయ వేదికలపై కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ హాస్యనటుడు హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన, జనసైనికులతో పాటు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

నాయకుల స్థాయిలో ఉండే వ్యవహారాలను కార్యకర్తలు వ్యక్తిగతంగా తీసుకుని గొడవలకు దిగడం సరికాదని ఆది అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి అగ్రనేతలు ఎప్పుడైనా ఒకరి చొక్కా మరొకరు పట్టుకుని కొట్టుకోవడం చూశారా అంటూ ప్రశ్నించారు. పైస్థాయిలో నేతలు మాటల వరకే పరిమితమవుతారని, కానీ కిందిస్థాయిలో కార్యకర్తలు ఆవేశంతో ఘర్షణలకు దిగి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Hyper Aadi Urges Restraint Over Clash Politics Cites Chandrababu Jagan and Kadapa Incident viral video

ఇటీవల కడప జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన తనను ఎంతగానో కలచివేసిందని హైపర్ ఆది పేర్కొన్నారు. రాజకీయ గొడవల కంటే మన కుటుంబాల భవిష్యత్తు, క్షేమం ముఖ్యమని కార్యకర్తలకు గుర్తు చేశారు. కార్యకర్తలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటేనే వారి కుటుంబాలు బాగుంటాయని, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడతాయని హితవు పలికారు.

ఆది ప్రస్తావించిన కడప జిల్లా ఘటనకు సంబంధించి విషయానికి వస్తే చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఉద్రిక్తత నెలకొన్న వేళ జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించారు. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ, పోలీసులు, టీడీపీ నేతల తీరు వల్లే ఈ ఘటన జరిగిందంటూ జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. త్వరలో బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా!
రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. త్వరలో బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా!

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కళ్యాణం శివ శ్రీనివాసరావును పులివెందులకు పంపి, రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+