నేటి అపూర్వ ఘట్టంలో భాగస్వామ్యం దక్కింది- తిరుమల నీటి కొరత తీరుస్తాం..!!
తిరుమల శ్రీవారికి వర్దమాన్ జైన్ కుటుంబం 121 కిలోల బంగారం విరాళం ఇవ్వటాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ముఖ్యమంత్రి సమక్షంలో వర్దమాన్ టీటీడీకి బంగారు ఆభరణాలు అందచేసారు. ఎక్కడా దొరకని అనుభూతి తిరుమలలో దొరుకుతుందని చెప్పిన చంద్రబాబు.. తనకు ఈ ఆభరణాల విరాళం లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. తిరుమల లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తిరుమలలో శ్రీవారికి బంగారు ఆభరణాల విరాళం అందించిన అనంతరం వర్ధమాన్ జైన్, రాధికా జైన్‌తో కలిసి ముఖ్యమంత్రి మాట్లాడారు. శ్రీవారికి భారీ ఎత్తున విరాళం సమర్పించిన జైన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి వైభవం మాటల్లో చెప్పలేమని.. తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని చెప్పారు. మరెక్కడా దొరకనటువంటి దివ్యానూభుతి తిరుమల క్షేత్రంలోనే లభిస్తుందన్నారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో అపూర్వ ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారని వివరించారు. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే తన పై అలిపిరిలో దాడి జరిగిందని గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామే తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపోందించేలా కార్యక్రమాలు చేపడుతు న్నట్లు వివరించారు. గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి... దీనికి టీటీడీ నాందీ పలకాలన్నారు.

తిరుమల నీటి కొరత అధిగమిస్తాం
శ్రీవారి సేవకులు చాలా భక్తి విశ్వాసంతో సేవలు అందిస్తున్నారు... వారిని మరింత ప్రొత్సహించా లని సూచించారు. ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలను నిర్మించాలి... ఆ దేవాలయా ల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీటీడీ సహకారంతో రాష్ట్రంలో 5 వేల దేవాలయాల నిర్మాణాలు జరగబోతున్నట్లు వివరించారు. తిరుమల సహా అన్ని ప్రాంతాల కు నీటి కొరత లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. హంద్రీ-నీవా ద్వారా కళ్యాణి డ్యాంకు నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామ ని..భవిష్యత్తులో తిరుమలకు నీటి కొరత అనే ప్రశ్నే లేకుండా ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. జైన్ దంపతుల తరహాలోనే ధనవంతులు పేదల సంక్షేమం, సమాజ, ఆధ్యాత్మికత వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని చంద్రబాబు కోరారు.













Click it and Unblock the Notifications
