హైదరాబాద్ లో కుప్పకూలిన ట్రైనింగ్ విమానం.. విచారణ దిశగా డీజీసీఏ

హైదరాబాద్‌ లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా-152 శిక్షణ విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విమానం అదుపుతప్పి చెట్టుపై కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ట్రైనీ పైలట్ అనుష్క బజ్‌ పాయ్(23), ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కెప్టెన్ ఎం. ప్రశాంత్ కుమార్(30) ఉన్నారు. ఇక విమానం కుప్పకూలడంతో అనుష్క తలకు బలమైన గాయాలు అయ్యాయి. అలాగే ప్రశాంత్ కుమార్‌ కు కూడా గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై గోల్కొండ పోలీసులు మాట్లాడుతూ.." తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో గోల్కొండ లోని ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించగా విమానం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలోని స్టూడెంట్, ఇన్ స్ట్రక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది" అని తెలిపారు. ఇక ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిన్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణను చేపట్టాల్సి ఉంది. అలాగే ఈ ప్రమాదంపై ఏవియేషన్ రెగ్యూలేటర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Aircraft training crashed within the Golconda Army Cantonment area Hyderabad two sustained injuries

ఇక ట్రైనింగ్ విమానం కుప్పకూలడానికి గల కారణంపై డీజీసీఏ చేపట్టే విచారణలోనే పూర్తి సమాచారం వెల్లడికానుంది. ఎయిర్ క్రాఫ్ట్ సాంకేతిక సమస్యతోనే కుప్ప కూలిందా..? లేక ఇతర ఏదైనా ఆపరేషనల్ సమస్య ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ ఘటన జరగకముందు ఎయిర్ క్రాఫ్ట్ సాధారణంగానే పని చేసిందా..? అనే దానిపైనా విచారణలో తేలాల్సి ఉంది. ఈ మేరకు విమానం కుప్పకూలడానికి గల కారణం డీజీసీఏ విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+