కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ఫైన్..?: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పష్టత

కారులో ఒంటరిగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీస్ విభాగం క్లారిటీ ఇచ్చింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ఫైన్ అంటూ ప్రచారం అనేది ఫేక్ న్యూస్ అని పేర్కొంది. హైదరాబాద్‌ లో కారులో ఒంటరిగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, రీల్స్ పూర్తిగా తప్పుదోవ పట్టించేవని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. కారులో ఒంటరిగా ప్రయాణించినందుకు ఎలాంటి జరిమానా లేదని.. కొత్తగా 'కంజెషన్ ఫైన్' విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ధృవీకరణ లేదని పేర్కొన్నారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్లలో ఒంటరిగా ప్రయాణించకుండా, ఇతరులతో కలిసి కార్‌ పూలింగ్ చేయాలని మాత్రమే ప్రయాణికులకు సూచించామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వీలైనంత వరకు వాహనాల సంఖ్యను తగ్గించి, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఉమ్మడి ప్రయాణాన్ని ప్రోత్సహించడమే ఈ విజ్ఞప్తి ఉద్దేశమని తెలిపారు. ఇక ఈ వదంతులను నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అధికారిక ప్రకటనలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని విశ్వసించాలని సూచించారు.

Hyderabad Traffic fine for traveling alone in a car Hyderabad Traffic Police provide clarification

హైదరాబాద్ ట్రాఫిక్‌ కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, నిర్ధారణ లేని పోస్టులను ఫార్వర్డ్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే ట్రాఫిక్ అప్‌డేట్స్ తెలుసుకోవాలని కోరారు. ఇక ట్రాఫిక్ సంబంధిత సమస్యలు, సమాచారం కోసం 9010203626 హెల్ప్‌ లైన్‌ ను సంప్రదించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+