జపాన్‌ లోనూ అయ్యగారే నెం. 1.. అక్కినేని అఖిల్ 'లెనిన్' మూవీ ర్యాంపేజ్..

అక్కినేని అఖిల్ 'అఖిల్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన 'మనం' సినిమా చివరలో చిన్న గెస్ట్ రోల్ లో నటించారు. ఇక అఖిల్ మూవీ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తదితర సినిమాలతో అలరించారు అఖిల్. 2023 లో ఏజెంట్ మూవీతో వచ్చిన అఖిల్.. ఈ ఏడాది 2026 లో లెనిన్ మూవీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అఖిల్ కెరీర్​ లో తొలి వంద కోట్ల సినిమా ఇదే కావడం విశేషం.

లెనిన్ సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 16 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాక తొలి వారంలోనే ఈ మూవీ బుక్ మై షో ద్వారానే ఏకంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడై అఖిల్ కెరీర్ లో మరో రికార్డు నెలకొల్పింది. ఓవరాల్ గా లెనిన్ మూవీ అఖిల్ కెరీర్​ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ నింపింది.

AkkineniAkhil latest blockbuster film Lenin to have grand release in Japan on December 11 official

అయితే ఇప్పుడు అఖిల్ మూవీ జపాన్ లోనూ అలరించేందుకు సిద్ధం అవుతోంది. 2026 డిసెంబర్ 11న జపాన్‌ లో 'లెనిన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మూవీకి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారిగా అఖిల్ రూరల్ కుర్రాడి పాత్ర పోషించి నటనలో అదరగొట్టారు. ఈ మూవీలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్​ గా నటించింది. అలాగే ఈ సినిమాలో శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+