రవితేజను తక్కువ అంచనా వేయొద్దు.. రూ.వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి

బయటకు సాదాసీదాగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా కనిపించే రవితేజను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సినీ పరిశ్రమలో తన కష్టాన్ని, తెలివిని జోడించి ఆయన వేల కోట్ల విలువైన ఆస్తులకు, భారీ సంపదకు అధిపతిగా ఎదిగిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఆయన అధికారికంగా ధృవీకరించని నికర ఆస్తుల విలువ సుమారు రూ. 120 కోట్ల నుండి రూ. 180 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన కొనుగోలు చేసిన భూముల ప్రస్తుత మార్కెట్ విలువను కలుపుకుంటే, ఆ సంపద వందల కోట్లను దాటి వేల కోట్ల స్థాయిలో ఉంటుందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

రిలయ్ ఎస్టేట్ లో పెట్టుబడి

టాలీవుడ్‌లో చాలామంది హీరోలు సంపాదించిన మొత్తాన్ని భూములు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడతారు. రవితేజ కూడా ఎంతో ముందుచూపుతో ఆ పని చేశారు. 'ఇరుముడి' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు అజయ్ ఘోష్ చెప్పిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు సమీపంలోని శంకర్‌పల్లి వద్ద రవితేజకు దాదాపు 26 ఎకరాల విశాలమైన తోట ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఆయన ఈ 26 ఎకరాల భూమిని కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేశారట. కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం, శంకర్‌పల్లి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఆ భూమి విలువ ఇప్పుడు వందల కోట్లకు చేరిందని అజయ్ ఘోష్ వెల్లడించారు.

Ravi Teja The Man Behind a Thousand Crore Empire

మాస్ జాతర సమయంలో అజయ్ చెప్పారు

రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన 'మాస్ జాతర' చిత్రం షూటింగ్ సమయంలో ఈ ఆస్తి ప్రత్యేకత మరోసారి బయటపడింది. ఆ సినిమా కోసం రైల్వే స్టేషన్ సెట్, ఇంటి సెట్‌లను ఏకంగా శంకర్‌పల్లిలోని రవితేజకు చెందిన 26 ఎకరాల తోటలోనే ఏర్పాటు చేసి షూటింగ్ జరిపినట్లు అజయ్ ఘోష్ తెలిపారు. సొంత స్థలంలోనే భారీ సెట్లతో సినిమా చిత్రీకరణ జరగడం విశేషంగా నిలిచింది. శంకర్‌పల్లి భూమితో పాటు రవితేజకు స్వగ్రామమైన జగ్గంపేటలో పూర్వీకుల ఆస్తులు, హైదరాబాద్‌లో విలువైన నివాసాలు ఉన్నట్లు వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. సినిమాల పారితోషికం, లాభాల్లో వాటా, ఇతర పెట్టుబడుల ద్వారా ఆయనకు నిరంతర ఆదాయం సమకూరుతోంది. ఈ ఆస్తులు, పెట్టుబడుల ప్రస్తుత విలువను పరిగణనలోకి తీసుకుంటే రవితేజ ఆర్థిక బలం ఎంత పెద్దదో అర్థమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిరాడంబరంగా మాస్ మహారాజా

ఇంతటి భారీ సంపద, విలువైన భూములు ఉన్నప్పటికీ రవితేజ ఆలోచన తీరు ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి ఆ తోట విలువ గురించి ఆశ్చర్యంతో రవితేజను ప్రశ్నించగా.. "ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి కానీ, మన పని మనం చేసుకుంటూ పోవాలి" అని ఆయన సమాధానమిచ్చినట్లు అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. కోట్ల ఆస్తుల అధిపతిగా ఉన్నా, పని పట్ల నిబద్ధత, సాధారణ జీవనశైలి రవితేజను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+