రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. త్వరలో బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా!

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అందిస్తున్న సన్నబియ్యంతో పాటు మరిన్ని నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఆర్థిక, సరఫరా పరమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేసి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరుగుతున్న వేళ ఏయే వస్తువులను రాయితీ లేదా సులభతర విధానంలో ప్రజలకు చేరవేయొచ్చో అధ్యయనం చేయాలని అధికారులు దృష్టి సారించారు. ఈ నివేదికలు సిద్ధమైన తర్వాత వాటిని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచి, తదుపరి కేబినెట్ ఆమోదంతో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Telangana ration Government Mulls Supplying Essential Commodities Along With Fine Rice via Ration Shops

రాబోయే కాలంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతంలో మార్పులు, పంట దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో ఆహారధాన్యాల కొరత తలెత్తకుండా కనీసం 15 నెలల అవసరాలకు సరిపడా సన్నబియ్యం బఫర్ నిల్వలను ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

మరోవైపు ఎల్‌నినో సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఐదు నెలల కాలవ్యవధిలో సుమారు రూ.10 వేల కోట్లతో జలవనరుల అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీని ద్వారా వ్యవసాయ సాగుకు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని యోచిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది రేషన్ కార్డుల పరిధిలో కోట్లాది మంది లబ్ధిదారులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. గతంలోనూ, ఇటీవలి చర్చల్లోనూ బియ్యంతో పాటు కిరాణా అవసరాలకు ఉపయోగపడే కందిపప్పు, పామాయిల్, చక్కెర, గోధుమపిండి, చింతపండు, కారంపొడి వంటి నిత్యావసరాలను చేర్చే అంశంపై వివిధ కోణాల్లో పరిశీలనలు జరుగుతున్నాయి.

పెరుగుతున్న ధాన్యం సేకరణకు అనుగుణంగా ఆధునిక సిలో తరహా నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రైవేట్ మిల్లులపై ఆధారపడటాన్ని తగ్గించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త సరుకులను చేరిస్తే ఏటా ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది, టెండర్లు లేదా సేకరణ ప్రక్రియ ఎలా ఉండాలి, ఒక్కో కుటుంబానికి ఎంత పరిమాణంలో పంపిణీ చేయాలి వంటి అంశాలపై లెక్కలు కడుతున్నారు.

ఎకోటూరిజం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఎకోటూరిజం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం!

వాతావరణ మార్పులు, కరువు పరిస్థితుల వల్ల ఇబ్బంది పడే బలహీన వర్గాల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశంగా నిలుస్తోంది. అధికారుల నివేదికలు, బడ్జెట్ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాతే ఏయే సరుకులను, ఎప్పటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా అందిస్తారనే దానిపై స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+