దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
దేశీయ మార్కెట్లో టయోటా మరో కీలక ముందడుగు వేసింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ తో పాటు హైబ్రిడ్ సెటప్ కలిగిన దేశంలోనే తొలి కారును కంపెనీ విడుదల చేసింది. కొత్త పవర్ ట్రెయిన్‌తో వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ కారును ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ రూపంలో తీసుకొచ్చారు. మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఉన్నప్పటికీ.. వాటిలో హైబ్రిడ్ సెటప్ లేదు. టయోటా తీసుకొచ్చిన ఈ కొత్త కారును ఈ-20 నుంచి ఈ-85 వరకు ఏ పెట్రోల్ బ్లెండ్‌తోనైనా నడపవచ్చు. ఫ్లైక్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద ఈ అప్‌డేటెడ్ పవర్‌ట్రెయిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ధరలు, వేరియంట్ల వివరాలు ఇలా..
కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.19.59 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి.
| వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధర |
| బేస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ | రూ. 19.99 లక్షల నుంచి |
| జీఎక్స్ (GX) | రూ. 23.99 లక్షలు |
| వీఎక్స్ (VX) | రూ. 28.79 లక్షలు |
| జెడ్ఎక్స్ (ZX - టాప్ వేరియంట్) | రూ. 31.99 లక్షలు |

డిజైన్, ఇంజిన్, ఫీచర్లు
అప్‌డేటెడ్ ఇన్నోవా హైక్రాస్ లో వెడల్పుగా కనపించే ఫ్రంట్ ఫేస్, సిల్వర్ ఫినిష్ తో కూడిన పెద్ద గ్రిల్‌ను అమర్చారు. టయోటా లోగోతో ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ ఉన్నాయి. మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కిటికీలపై క్రోమ్ గార్నిష్, డార్క్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ కారుకు ఎస్‌యూవీ తరహా లుక్‌ను ఇస్తాయి. రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఉన్నాయి. సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్ అనే ఐదు రంగులలో ఈ కారు లబిస్తుంది. ఇందులో 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ సెటప్ ఉంది. ఇది 186 hp పవర్‌ను అందిస్తుంది. నార్మల్, ఈకో, పవర్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ ప్లే, అంతే సైజులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. రెండో వరుసలో ఒట్టోమన్ సీట్లు, ముందు సీట్లలో వెంటిలేషన్ సౌకర్యం కల్పించారు. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 9 స్పీకర్ల ఆడియో సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగులతో పాటు ప్రీ-కొలిజన్ సిస్టమ్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ట్రేస్ అసిస్ట్ వంటి టయోటా సేఫ్టీ సెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.














Click it and Unblock the Notifications
