తగ్గినట్టే తగ్గి భారీ షాకిచ్చిన బంగారం ధరలు!

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పైకి ఎగబాకాయి. ఇటీవల వరుసగా భారీగా పడిపోయిన బంగారం ధరలు తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో కొంత కోలుకున్నాయి. తగ్గిన ధరల వద్ద కొనుగోలు చేసేందుకు పలువురు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో గురువారం(నవంబర్ 26) దేశీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ఈ పరిణామంతో ధరలు మరింత పెరుగుతాయా, కొనుగోళ్లకు ఇది సరైన సమయమా అనే చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైంది.

 తిరుమల చేరిన 121 కిలోల బంగారం, శ్రీవారి ఆభరణాలివీ - నేడే.. ఎవరీ భక్తుడు..!!
తిరుమల చేరిన 121 కిలోల బంగారం, శ్రీవారి ఆభరణాలివీ - నేడే.. ఎవరీ భక్తుడు..!!

దేశవ్యాప్తంగా బంగారం ధరల వివరాలు
నవంబర్ 26, గురువారం దేశంలో స్వచ్ఛత ఆధారంగా బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

24 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ.261 పెరిగి రూ.12,589 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాములకు రూ.2610 పెరిగి రూ.1,25,890గా ఉండగా.. 100 గ్రాముల ధర రూ.26,100 పెరిగి రూ.12,58,900 వద్దకు చేరింది.

22 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ. 240 పెరిగి రూ.11,540 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాములకు రూ.2,400 పెరిగి రూ.1,15,400గా ఉండగా.. 100 గ్రాముల ధర రూ.24,000 పెరిగి రూ.11, 54,000 వద్ద నిలిచింది.

18 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ. 196 పెరిగి రూ. 9,442 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాములకు రూ. 1,960 పెరిగి రూ. 94,420గా ఉండగా, 100 గ్రాముల ధర రూ. 19,600 పెరిగి రూ. 9,44,200 వద్ద ఉంది.

Gold Prices Jump Again on Nov 26 Latest 24K 22K and 18K Rates Across Major Cities Full Details Here

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి రేట్లు
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నమోదైన 10 గ్రాముల బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

నగరం 24 క్యారెట్లు (10 గ్రా.) 22 క్యారెట్లు (10 గ్రా.) 18 క్యారెట్లు (10 గ్రా.)
హైదరాబాద్ రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,420
విజయవాడ రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,420
విశాఖపట్నం రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,420
చెన్నై రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,450
ముంబై రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,420
బెంగళూరు రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,420
కోల్‌కతా రూ. 1,25,890 రూ. 1,15,400 రూ. 94,420
ఢిల్లీ రూ. 1,26,040 రూ. 1,15,550 రూ. 94,570
అహ్మదాబాద్ రూ. 1,25,940 రూ. 1,15,450 రూ. 94,470

పెళ్లిళ్ల సీజన్ వేళ.. మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు

మార్కెట్ తీరు, కొనుగోలుదారుల ఆలోచనలు
ఇటీవలి పతనంతో తక్కువ స్థాయికి చేరిన బంగారం ధరలు, మళ్లీ పుంజుకోవడం మార్కెట్లో కొత్త కదలికలకు దారితీసింది. అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ డిమాండ్, మదుపర్ల కొనుగోళ్ల జోరు కారణంగా పసిడి రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆభరణాల ప్రియులు, దీర్ఘకాలిక మదుపర్లు ధరల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. పండుగలు, వివాహ సీజన్ల నేపథ్యంలో ధరల పెరుగుదల సామాన్య కొనుగోలుదారులపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్కున్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ ధరలల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+