రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి కొత్తగా, తక్కువ ధరలకే పంపిణీ..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది. ధరల భారం సామాన్యుల పైన పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధరల నుంచి ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేసారు. అందులో భాగంగా వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసరాలు తక్కువ ధరకే పంపిణీ చేయాలని నిర్ణయించారు.
పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం మేరకు డిసెంబర్ మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు కందిపప్పు, పామాయిల్ పంపిణీ ప్రారంభించనుంది. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పును రూ.100కే, లీటరు పామాయిల్‌ను రూ.125కే ప్రజలకు అందించాలని డిసైడ్ అయ్యారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కందిపప్పు ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, కేంద్రం కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందుల సరఫరాకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. మరోవైపు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రస్తుతం 286గా ఉన్న ధరణి బ్రాండ్ బియ్యం విక్రయ కేంద్రాలను 500కు పెంచాలని నిర్దేశించారు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
కాగా, ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు ధరణి బియ్యం కొనుగోలు చేశారని, మొత్తం 59,662 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయని అధికారులు వివరించారు. అదే విధంగా ధరణి బ్రాండ్ కింద మార్కెట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రూ.76 మార్కెట్ ధర ఉన్న KNM/RNR రకం బియ్యాన్ని రూ.50కే, రూ.66 మార్కెట్ ధర ఉన్న BPT రకం బియ్యాన్ని రూ.49కే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గగా, ఉల్లి ధరలు 28 శాతం తగ్గాయని, పామాయిల్ ధర లీటరుకు రూ.145కు చేరిందని గణాంకాలు వెల్లడించాయి. కందిపప్పు ధరలను నియంత్రించడంతో పాటు కంది పండించే రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ తరలింపుపై నిరంతరం నిఘా ఉంచాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications
